ETV Bharat / bharat

జమ్ము కశ్మీర్‌లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు ముష్కరుల హతం - లేటెస్ట్ ఎన్​కౌంటర్​ న్యూస్​

జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఎన్​కౌంటర్​లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పక్కా సమాచారంలో దాడులు నిర్వహించిన భద్రతా దళాలు.. విజయవంతంగా ఉగ్రవాదులకు ముట్టబెట్టారు.

3 Militants Killed in encounter
జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్​కౌంటర్​
author img

By

Published : Dec 20, 2022, 9:06 AM IST

జమ్ముకశ్మీర్‌ షోపియాన్​ జిల్లాలో ఎన్​కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం జైనాపోరా ప్రాంతంలోని ముంజ్​మార్గ్​లో ఉగ్రవాదులున్నట్లు.. భద్రతా దళాలకు సమాచారం అందింది. వెంటనే సైన్యం, పోలీసులు కలిసి ఆ ప్రాంతంలో సెర్చ్​ ఆపరేషన్​ నిర్వహించారు.

సైన్యాన్ని చూసిన ఉగ్రవాదులు ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు. సైన్యం కూడా ముష్కరులపై ఎదురుదాడి చేయగా.. లష్కరే తోయిబాకు చెందిన ముగ్గరు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు వెల్లడించారు. వారినుంచి కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. కశ్మీరీ పండిట్ పురాణ కృష్ణ భట్‌ను చంపడంలో వీరికి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.