ETV Bharat / bharat

బోటు ప్రమాదంలో 22 మంది బలి.. ఒకే ఫ్యామిలీలో 12 మంది!.. లైఫ్​ జాకెట్​ ధరించని టూరిస్ట్​లు..

author img

By

Published : May 8, 2023, 9:56 AM IST

Updated : May 8, 2023, 12:32 PM IST

కేరళలో జరిగిన టూరిస్ట్​ పడవ బోల్తా ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 22 మంది మరణించారని అధికారులు చెప్పగా.. అందులో 15 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. అయితే మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ఉన్నారు.

rescue operations
rescue operations
బోటు ప్రమాదంలో 22 మంది బలి.. ఒకే ఫ్యామిలీలో 14 మంది!.. లైఫ్​ జాకెట్​ ధరించని టూరిస్ట్​లు..

కేరళ మలప్పురంలో జరిగిన పర్యటక పడవ బోల్తా ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. మృతుల్లో 15 మంది పిల్లలు ఉన్నారు. అయితే మరణించిన వారిలో తానూర్ కునుమ్మల్ సైతలవి కుటుంబానికి చెందిన 12 మంది ఉన్నారు. మరోవైపు ప్రమాదానికి గురైన డబుల్ డెక్కర్ బోటును వెలికి తీశారు అధికారులు. జేసీబీ సాయంతో బోటును ఒడ్డుకు తీసుకొచ్చారు. తీరం నుంచి అర కిలోమీటరు దూరం వెళ్లగానే బోటు ఓ పక్కకు ఒరిగిపోయినట్లు సమాచారం. దీంతో ప్రయాణికులంతా నీట మునిగినట్లు తెలుస్తోంది. కాగా, బోటు యజమాని ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

రెస్క్యూ ఆపరేషన్‌లో జాప్యం..
ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ మాత్రం రాత్రి 8 గంటలకు ప్రారంభమైందని.. అందుకే మృతుల సంఖ్య మరింత పెరిగిందని ఆరోపిస్తున్నారు. బాధితుల కేకలు విన్న స్థానికులు పడవ బోల్తా పడిన విషయం తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం అగ్నిమాపక దళం, ఎన్‌డిఆర్‌ఎఫ్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ వెలుతురు లేకపోవడం వల్ల సహాయక చర్యలు కష్టతరంగా మారాయి. బోటును ఒడ్డుకు చేర్చేందుకు తొలి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ప్రమాద బాధితులను ముందుగా చిన్న పడవల్లో ఒడ్డుకు చేర్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో వివిధ ఆస్పత్రులకు తరలించారు.

భద్రతా నిబంధనలు ఉల్లంఘించడం వల్లే!
అయితే భద్రతా నిబంధనలు ఉల్లంఘించి బోటు ప్రయాణం చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. బోటుకు లైసెన్స్ లేదని, బోటు సామర్థ్యం కన్నా ఎక్కువ ముందే ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని అధికారులు అంటున్నారు. ఓవర్​లోడ్​ వల్లే పడవ బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకే బోటు యాత్రకు అనుమతి ఉందని.. కానీ ఏడు గంటలకు ప్రమాదం జరగడం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోటులో ఉన్నవారు లైఫ్ జాకెట్లు వినియోగించలేదని స్థానికులు ఆరోపించారు. కేరళ టూరిజం అనుమతితోనే డబుల్​ డెక్కర్​ బోట్​ సర్వీస్​ ఓ ప్రైవేట్​ వ్యక్తి నడుపుతున్నట్లు తెలిసింది. భద్రతా సౌకర్యాలు లేకుండా బోటు సర్వీసు నడుపుతున్నట్లు గతంలో ఫిర్యాదులు వచ్చినట్లు స్థానికులు తెలిపారు.

ఒకే కుటుంబంలోని 12 మంది మృతి
ఈ దుర్ఘటనలో తానూర్​ కునుమ్మల్ సైతలవి కుటుంబానికి చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎనిమిది నెలల చిన్నారితో పాటు ఏడుగురు పిల్లలు ఉన్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడం వల్ల విహారయాత్రకు వెళ్లిన వీరంతా బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. "ఎట్టి పరిస్థితుల్లోనూ పడవ ఎక్కవద్దని చెప్పాను. అయినా వారు వెళ్లారు. భార్యకు ఫోన్ చేయగా అరుపులు వినిపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికిీ.. జరగకూడనది జరిగింది" అని కున్నుమ్మల్ సైతలవి చెప్పారు.

న్యాయ విచారణకు కేరళ సర్కార్​ ఆదేశాలు..
పర్యటక బోటు బోల్తా పడిన ఘటనపై న్యాయ విచారణ జరపాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది.

ఘటనాస్థలికి సీఎం..
ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఘటనాస్థలాన్ని పరిశీలించారు. తిరురంగడి ఆస్పత్రికి చేరుకుని ఆయన బాధితులను పరామర్శించారు. ఘటన నేపథ్యంలో కేరళ వ్యాప్తంగా సోమవారం సంతాపదినం ప్రకటించారు. అధికారిక కార్యక్రమాలను రద్దు చేశారు.

ప్రధాని మోదీ సంతాపం.. రూ.2లక్షల ఎక్స్​గ్రేషియా
కేరళలో జరిగిన పడవ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్​గ్రేషియాగా రూ.2 లక్షలను ప్రకటించారు. 'కేరళ మలప్పురంలో జరిగిన పడవ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరం. మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తాం. ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది' అని మోదీ ట్విట్టర్​లో పేర్కొన్నారు. కేరళలో బోటు ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు.

Last Updated : May 8, 2023, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.