ETV Bharat / bharat

ఆప్​ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్​ భేటీ, కొందరు మిస్​​, భాజపా పనేనా - aap mlas special meet on delhi

AAP MLAs Missing ఆమ్​ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను భాజపా తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ తన నివాసంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 62 మంది ఆప్​ ఎమ్మెల్యేలకుగాను 53 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. భారతీయ జనతా పార్టీ చేసిన ఆపరేషన్ కమలం విఫలమైందని ఆమ్‌ ఆద్మీ పార్టీ వెల్లడించింది.

aap
అరవింద్​ కేజ్రీవాల్​
author img

By

Published : Aug 25, 2022, 2:08 PM IST

AAP MLAs Missing: దిల్లీలో రాజకీయం వేడెక్కుతోంది. ఆమ్​ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను భాజపా తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోందని వస్తున్న వార్తల నేపథ్యంలో సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కానీ, సమావేశానికి కొందరు హాజరుకాలేదని, వారు ప్రస్తుతం అందుబాటులో లేరని వార్తలు వెలువడ్డాయి. ఆప్‌ నేతల వాదన మాత్రం భిన్నంగా ఉంది. ఈ సమావేశంలో మొత్తం 62 మంది ఆప్​ ఎమ్మెల్యేలకుగానూ 53 మంది హాజరైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరుకాలేక పోయారని వెల్లడించింది. సత్యేంద్ర జైన్​ జైల్​లో ఉండగా.. మరో ఎమ్మెల్యే ఫోన్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారని స్పష్టం చేశారు పార్టీ ప్రతినిధి సౌరభ్​ భరద్వాజ్​.

తమ పార్టీలో చీలికలు తెచ్చేందుకు భారతీయ జనతాపార్టీ చేసిన ఆపరేషన్ కమలం విఫలమైందని ఆమ్‌ ఆద్మీ పార్టీ వెల్లడించింది. పార్టీలో చీలిక తెచ్చేందుకు 12 మంది ఎమ్మెల్యేలను భాజపా సంప్రదించినట్లు ఆప్​ ప్రతినిధి సౌరభ్​ భరద్వాజ్​ ఆరోపించారు. ఒక్కొక్కరికి రూ.20 కోట్లు చొప్పున ఇచ్చి 40 మంది ఎమ్మెల్యేలను చీల్చేందుకు యత్నించిందని ఆరోపణలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలను తమ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారని అన్నారు. ఎప్పటికీ తాము ఆమ్‌ ఆద్మీలోనే ఉంటామని వారంతా స్పష్టం చేసినట్లు వెల్లడించారు.

"తమ పార్టీలోని 40 మంది ఎమ్మెల్యేలకు భాజపా ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఆశ చూపింది. భాజపాకు ఈ రూ.800 కోట్లు ఎక్కడివని సీబీఐ, ఈడీలు ప్రశ్నించాలి. పార్టీ మారే ప్రతిపాదనతో భాజపా నాయకులు తమను సంప్రదించారని ఆప్​కు చెందిన 20-25 మంది ఎమ్మెల్యేలు తెలిపారు. సమావేశానికి హాజరు కాలేకపోయిన మా ఎమ్మెల్యేలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఉండవచ్చు. కొన్ని పరిస్థితుల కారణంగా మేము వారిని సంప్రదించలేకపోయాము. అయితే ఆప్ ప్రభుత్వం పడిపోదని మేము దిల్లీ ప్రజలకు హామీ ఇస్తున్నాం. భాజపా ఎంపీ మనోజ్​ తివారీ దిల్లీలో నూతన ఎక్సైజ్​ పాలసీ విషయంలో కేజ్రీవాల్​ స్పందిచడం లేదన్న వ్యాఖ్యలు చేసింది.. కేవలం ప్రజల దృష్టి మరల్చడానికే. ఇదంతా భాజపా చేస్తున్న పబ్లిక్​ స్టంట్​. కేజ్రీవాల్..​ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆపరేషన్​ కమలం విఫలమవ్వాలని కోరుతూ మహాత్మా గాంధీ రాజ్​ఘాట్​ వద్దకు ప్రార్థన నిర్వహించ తలపెట్టాం.''

- సౌరభ్​ భరద్వాజ్, ఆమ్​ ఆద్మీ పార్టీ ప్రతినిధి

దిల్లీ ప్రభుత్వం మద్యం కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని భాజపా ఆరోపించింది. పార్టీ మారే ప్రతిపాదనతో తమ ఎమ్మెల్యేలను సంప్రదించిన వారి పేర్లను వెల్లడించాలని ఆప్​కు సవాల్​ చేసింది. దిల్లీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తమ ఎమ్మెల్యేలను తనవైపునకు లాక్కోవాలని భాజపా ప్రయత్నిస్తున్నట్లు ఆప్‌ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు సీఎం అరవింద్​ కేజ్రీవాల్​.

ఇవీ చదవండి: పెగసస్​పై సుప్రీం కీలక వ్యాఖ్యలు, 5 ఫోన్లలో మాల్​వేర్​ ఉంది కానీ

జమ్ముకశ్మీర్​లో వరుస భూకంపాలు, వణుకుతున్న జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.