ETV Bharat / bharat

బంగాల్​: మధ్యాహ్నానికి 55% పోలింగ్

bengal elections
బంగాల్​ ఏడో విడత పోలింగ్
author img

By

Published : Apr 26, 2021, 6:58 AM IST

Updated : Apr 26, 2021, 2:15 PM IST

14:13 April 26

బంగాల్​లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 55.12 శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

11:44 April 26

మాల్డా జిల్లా రతువాలోని బాఖ్రా గ్రామంలో ఓ బూత్​ నుంచి భాజపా పోలింగ్​ ఏజెంట్​ శంకర్​ సకార్​ను​ వెళ్లగొట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శంకర్​.. బాఖ్రా ఓటరు కాకపోయినా అక్కడ విధుల్లో ఉన్నాడని, అందుకే మర్యాదపూర్వకంగా వెళ్లిపోమని చెప్పినట్లు టీఎంసీ కార్యకర్తలు చెప్పారు. అయితే టీఎంసీ కార్యకర్తలు తనను బలవంతంగా బూత్​ నుంచి తరిమేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని శంకర్ ఆరోపించారు.

11:35 April 26

  • EC has said that you can't wear anything that has your party's symbol or a political leader's picture. This is Mamata Banerjee's trick. She knows people won't vote for her. Her time is up. The agent says that he didn't know about it. I will complain: Agnimitra Paul, BJP pic.twitter.com/7qIdx37SJd

    — ANI (@ANI) April 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పశ్చిమ బర్ధమాన్​ జిల్లాలోని బర్కత్​నగర్​ హైస్కూల్​లో టీఎంసీ పోలింగ్ ఏజెంట్.. మమత ఫొటో ఉన్న క్యాపు ధరించారని అసాన్​సోల్​ దక్షిణ్​ నియోజకవర్గ భాజపా అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ గుర్తులు, నేతల ఫొటోలను ధరించడానికి ఈసీ అనుమతి లేదని, ఇదంతా మమతా బెనర్జీ కుయుక్తులని చెప్పారు. ప్రజలు మమతకు ఓటేయని, ఆమె పని అయిపోయిందని విమర్శించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు అగ్నిమిత్ర.

11:28 April 26

బంగాల్​ ఏడో విడత ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 37.72 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు భారీగా పోలింగ్ స్టేషన్లకు తరలి వస్తున్నారు.

09:53 April 26

బంగాల్​లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 9.32 గంటల వరకు 17.47శాతం పోలింగ్ నమోదైంది.

09:48 April 26

  • Wherever I've been campaigning I've seen people's support for only one face-our CM's...Why was EC sleeping all this while? When PM decided he won't hold any public meetings, EC decided to call off all public meetings. It listens to PM & HM more than anyone else: Nusrat Jahan Ruhi pic.twitter.com/cg7Lp1xwxc

కోల్​కతాలోని భవానీపుర్​లో టీఎంసీ ఎంపీ నుస్రత్​ జహాన్​ తన తల్లిదండ్రలతో కలిసి ఓటేశారు. బంగాల్​లో ఎక్కడికెళ్లినా సీఎం మమతకే ప్రజలు మద్దతు తెలుపుతున్నారని ఆమె అన్నారు. బహిరంగ సభలను ప్రధాని మోదీ రద్దు చేసుకున్న తర్వాత ఎన్నికల సంఘం వాటిపై నిషేధం విధించడాన్ని ఆమె తప్పుబట్టాడు. ఇన్ని రోజులు ఈసీ ఏం చేసిందని ప్రశ్నించారు. అందరికన్నా ఎక్కువగా ప్రధాని, హోంమంత్రి ఆదేశాలనే ఎన్నికల సంఘం పాటిస్తోందని దుయ్యబట్టారు.

09:42 April 26

  • TMC MP Abhishek Banerjee cast his vote for 7th phase of #WestBengalElections at Mitra Institution in Bhowanipore, Kolkata. He says, "Extremely confident that Mamata Banerjee will be back with 2/3rd majority...People are dying but EC is conducting 8-phase polls to benefit a party" pic.twitter.com/KOL3QfQc7J

కోల్​కతాలోని భవానీపుర్​లో తృణమూల్​ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఓటు వేశారు. 2/3 మెజారిటీతో టీఎంసీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. ప్రజలు కరోనాతో చనిపోతున్నా.. ఓ పార్టీకి లబ్ధి చేకూర్చడానికి ఎన్నికల సంఘం 8 దశల్లో పోలింగ్ నిర్వహిస్తోందని అభిషేక్ విమర్శించారు.

08:02 April 26

  • Kolkata: TMC candidate from Bhowanipore constituency, Sobhandeb Chattopadhyay cast his vote for the seventh phase of #WestBengalPolls, at the polling booth at Manmatha Nath Nandan Boys And Girls School. CM Mamata Banerjee is the sitting MLA from the constituency. pic.twitter.com/fn4qPuYVhR

సీఎం మమతా బెనర్జీ సిట్టింగ్ స్థానమైన భవానీపుర్​ నుంచి పోటీ చేస్తోన్న తృణమూల్ అభ్యర్థి శోభన్​ దేవ్ ఛటర్జీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మన్మథనాథ్​ పాఠశాలలో ఆయన ఓటేశారు. బంగాల్​ ప్రజలు మమత అభివృద్ధి, ప్రాజెక్టుల కోసం ఓటేస్తారని ఆయన అన్నారు. 1962 నుంచి రాజకీయాల్లో ఉన్న శోభన్​.. తొలిసారి తనకు తాను ఓటు వేసుకున్నట్లు తెలిపారు.

07:57 April 26

మాల్డా జిల్లా రతువా నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. శాంసీ ప్రైమరీ స్కూల్​లో ఏర్పాటు చేసిన పోలింగ్​ వద్ద.. భౌతిక దూరం పాటిస్తూ ఓటర్లు ఓటు వేస్తున్నారు. 

07:11 April 26

  • The seventh phase of the West Bengal elections takes place today. Urging people to exercise their franchise and follow all COVID-19 related protocols: PM Narendra Modi pic.twitter.com/qkwhR9tGE7

బంగాల్​ ఏడో దఫా ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని ట్టిట్టర్ వేదికగా  సూచించారు.

07:08 April 26

బాలుర్​ఘాట్ బూత్​ వద్ద ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. 

06:38 April 26

బంగాల్​: మధ్యాహ్నానికి 55% పోలింగ్

బంగాల్​లో ఏడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సిట్టింగ్​ స్థానమైన భవానీపుర్​ సహా 34 నియోజకవర్గాలకు నేడు ఓటింగ్ జరగనుంది. మొత్తం 284 మంది అభ్యర్థులు ఈ దశ బరిలో ఉన్నారు.

ముర్షీదాబాద్​ జిల్లాలో 9 నియోజకవర్గాలకు, పశ్చిమ బర్ధమాన్​ జిల్లాలో 9, దక్షిణ దినాజ్​పుర్​లో 6, మాల్డాలో 6, కోల్​కతాలోని 4 నియోజకవర్గాలకు 12,068 కేంద్రాల్లో పోలింగ్​ జరగనుంది. మొత్తం 284 మంది అభ్యర్థుల్లో 37 మంది మహిళలు ఉన్నారు.

పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు..

గత విడతల పోలింగ్​లో తలెత్తిన ఉద్రిక్తతల దృష్ట్యా.. ఈసారి భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 796 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినట్లు చెప్పింది. ఓటర్లు కొవిడ్-19 నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.

Last Updated : Apr 26, 2021, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.