ETV Bharat / bharat

Kidnap: ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు.. విశాఖలో దంపతుల కిడ్నాప్‌

author img

By

Published : Jun 29, 2023, 12:24 PM IST

Updated : Jun 29, 2023, 10:25 PM IST

విశాఖలో దంపతుల కిడ్నాప్
విశాఖలో దంపతుల కిడ్నాప్

12:17 June 29

పోలీసుల అదుపులో ముగ్గురు.. పరారీలో మరో నలుగురు

విశాఖలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ దంపతుల కిడ్నాప్‌ ఘటన వివరాలు తెలిపిన కమిషనర్ త్రివిక్రమవర్మ

Seven people tried to kidnap: విశాఖ నగరంలో ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఘటన మరువక ముందే.. తాజాగా మరో కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. ఏడుగురు వ్యక్తులు ఇద్దరు దంపతులను కిడ్నాప్ చేసి కారులో తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిలో ముగ్గురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. విశాఖపట్నంలో దంపతులు కిడ్నాప్​నకు గురయ్యారు. మహిళ కేకలు విని స్థానికులు గుమికూడడంతో కిడ్నాపర్లు పరారయ్యారు. అప్పటికే అప్రమత్తమైన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్​నకు గురైన దంపతులు లోవ లక్ష్మి(30), పి.శ్రీనివాసరావు(36) కాగా, వీరు విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఏజెంట్లుగా తెలిసింది. దంపతులు ఇద్దరూ... విజయవాడ నుంచి కొన్ని రోజుల కిందట వ్యాపారం కోసం విశాఖకు వచ్చారు. కాగా, విజయవాడలో వారితో కలిసి పని చేసిన వారే కిడ్నాప్‌నకు యత్నించారని సమాచారం. విజయవాడలో రూ.3 కోట్ల వరకు మోసం చేసినట్లు దంపతులపై ఆరోపణలు ఉన్నాయి.

విజయవాడకు చెందిన లక్ష్మి, శ్రీనివాసరావు వారం రోజుల కిందట విశాఖపట్నంలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏజెంట్లుగా చేరారు. ఈ క్రమంలో ఏడుగురు వ్యక్తులు దంపతులను బలవంతంగా కారులో ఎక్కించుకుని బయల్దేరారు. పాయకరావుపేట సమీపంలో లక్ష్మి కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని కారు నుంచి దిగి కేకలు వేసింది. ఏం జరుగుతోందో తెలియని స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడడంతో కిడ్నాపర్లు వారిని వదిలేసి పరారయ్యారు. ముగ్గురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న విశాఖ నాలుగో పట్టణ పోలీసులు... పరారైన మరో నలుగురు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు.

కిడ్నాప్‌ ఘటనపై స్పందించిన నగర పోలీస్‌ కమిషనర్ త్రివిక్రమవర్మ: విశాఖలో స్థిరాస్తి వ్యాపారి దంపతుల కిడ్నాప్‌ ఘటనపై నగర పోలీస్‌ కమిషనర్ త్రివిక్రమవర్మ స్పందించారు. స్థిరాస్తి వ్యాపారం ఆర్థిక లావాదేవీల్లో వివాదాల వల్లే దంపతులను కిడ్నాప్‌ చేసినట్లు సీపీ వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన పట్నాల శ్రీనివాస్‌, లోవ లక్ష్మి దంపతులు నాలుగు నెలల క్రితం విశాఖకు వచ్చి నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉంటున్నారు. బుధవారం పట్నాల శ్రీనివాస్‌ దంపతులను బ్రహ్మయ్య, సాయినిఖిల్‌, మణికంఠ, ప్రదీప్‌రెడ్డి అనే నలుగురు వ్యక్తులు శ్రీనివాస్‌ దంపతులను కారులో అపహరించారు. గతంలో శ్రీనివాస్‌ వీరితో కలిసి ఎంకే కన్‌స్ట్రక్షన్స్‌ పేరుతో వ్యాపారం చేశాడని సీపీ తెలిపారు. దంపతులను కిడ్నాప్‌ చేసిన అనంతంర ఎలమంచిలి దగ్గర శ్రీనివాస్‌ భార్య లక్ష్మిని విడిచిపెట్టడంతో.. ఆమె కత్తిపూడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితులను పట్టుకున్నామని తెలిపారు. గతంలో శ్రీనివాస్‌పై కంచికచర్ల, నర్సీపట్నం, రాజమండ్రి, విజయవాడలో మోసం కేసులు నమోదయ్యాయని సీపీ వెల్లడించారు.

MP MVV on Kidnap: కత్తులతో బెదిరించి.. హింసించి డబ్బులు వసూలు చేశారు: ఎంపీ ఎంవీవీ

Last Updated : Jun 29, 2023, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.