హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సుకేతీ ఖాడ్ నదిని దాటుతున్న మహీంద్రా పికప్ వాహనం అదుపుతప్పి వంతెనపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. మరొకరు గాయపడ్డారు. మండి జిల్లాలోని పుల్గ్రాహత్ ప్రాంతం వద్ద ఉదయం 2.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
ఘటనా స్థలిలోనే ఆరుగురు చనిపోయారని, గాయపడ్డ ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా మరొకరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.
మోదీ విచారం
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.