ETV Bharat / bharat

సీఎంకు షాక్- ఆ కేసు మూసివేతపై కోర్టు గరం! - కర్ణాటక డీనోటిఫికేషన్

భూముల డీనోటిఫికేషన్​కు సంబంధించి నమోదైన 15 ఏళ్ల నాటి కేసును మూసేయాలని కర్ణాటక లోకాయుక్త పోలీసుల నివేదికను అక్కడి ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. కర్ణాటక సీఎం యడియూరప్పపై ఈ కేసు నమోదైంది.

bs yadiyurappa
బీఎస్ యడియూరప్ప
author img

By

Published : Jul 3, 2021, 7:40 PM IST

కర్ణాటక సీఎం యడియూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. భూముల డీనోటిఫికేషన్​కు సంబంధించి ఆయనపై నమోదైన పదిహేనేళ్ల నాటి కేసును మూసేయాలన్న లోకాయుక్త పోలీసుల నివేదికను ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది.

ఈ కేసుపై పునర్విచారణ చేపట్టాలని లోకాయుక్త పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. వీలైనంత త్వరగా తుది నివేదిక అందించాలని స్పష్టం చేసింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాల ప్రకారం కేసు విచారణ జరిగేలా చూడాలని దర్యాప్తు అధికారులను ఆదేశించింది.

కేసు నేపథ్యమిది!

బెల్లాందుర్, దేవరబీసనహళ్లిలోని ప్రైమ్ ల్యాండ్​ డీనోటిఫికేషన్​కు సంబంధించిన ఈ కేసు.. 2000 సంవత్సరం నాటిది. వార్థుర్-వైట్​ఫీల్డ్ ఐటీ కారిడార్​కు చెందిన ఈ స్థలాన్ని 2000-01లో ఓ ఐటీ పార్క్​ కోసం సేకరించాలని కర్ణాటక సర్కారు నిర్ణయించింది.

అయితే, 2006-07లో అప్పటి భాజపా-జేడీఎస్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని వసుదేవ రెడ్డి అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు స్థల సేకరణను నిలిపివేస్తూ ప్రభుత్వం డీనోటిఫికేషన్ జారీ చేసింది. అప్పుడు యడియూరప్ప ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.

దీనిపై కోర్టు ఆదేశాల ప్రకారం అవినీతి నిరోధక చట్టం కింద 2015 ఫిబ్రవరి 21న కేసు నమోదైంది. ఈ కేసును కొట్టేయాలంటూ యడియూరప్ప 2020 డిసెంబర్​లో హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి పరిశ్రమల మంత్రి, కాంగ్రెస్ నేత ఆర్​వీ దేశ్​పాండేపై నమోదైన ఇదే కేసును హైకోర్టు గతంలోనే కొట్టేసిందని వాదించారు. తనపై విచారణ జరపడం అన్యాయమని అన్నారు. అయితే, ఈ పిటిషన్​ను న్యాయస్థానం తోసిపుచ్చింది.

ఇదీ చదవండి: ఉత్తరాఖండ్​ నూతన సీఎంగా పుష్కర్​ సింగ్ ధామీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.