కొవిషీల్డ్ టీకా తనపై దుష్ప్రభావం చూపించిందని చెన్నైకు చెందిన ఓ వలంటీర్ చేసిన ఆరోపణలను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ ఇండియా(సీఐఐ) ఖండించింది. వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలకు, వలంటీర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధం లేదని తేల్చిచెప్పింది. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను వ్యాక్సిన్‌పై మోపుతున్నారని మండిపడింది. డబ్బు కోసమే టీకాపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. టీకాపై ఈ విధంగా ఆరోపణలు చేసిన వ్యక్తి నుంచి రూ. 100కోట్లు వసూలు చేస్తామని హెచ్చరించింది. ఇలాంటి ప్రచారాలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది.
చెన్నైకు చెందిన ఓ బిజినెస్ కన్సల్టెంట్.. అక్టోబర్‌లో టీకా తీసుకున్నాడు. అనంతరం తనకు నాడీ సంబంధిత సమస్యలు తలెత్తినట్లు ఆయన ఆరోపించారు. కొవిషీల్డ్ టీకా ట్రయల్స్ నిర్వహిస్తోన్న సీరం సంస్థపై రూ. 5కోట్ల దావా వేశారు.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలతో కలిసి కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.
ఇదీ చదవండి: సీరం టీకా వలంటీర్ ఆరోపణలపై దర్యాప్తు