గురువారం జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని మహారాష్ట్ర పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధికారులు వెల్లడించారు. ఫలితంగా రానున్న రోజుల్లో బీసీజీ, రోటా వ్యాక్సిన్ల ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని చెప్పారు.
గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. అయితే.. ఈ ఘటనతో కొవిషీల్డ్ టీకా ఉత్పత్తి ప్రక్రియపై ఎలాంటి ప్రభావం ఉండదని సీరం సంస్థ సీఈఓ అదర్ పూనవాలా ఇప్పటికే స్పష్టం చేశారు.
ముమ్మర దర్యాప్తు
మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 3 విభాగాలు కలిసి సీరం ఇన్స్టిట్యూట్లో ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించాయి. పుణె పురపాలక సంస్థ(పీఎంసీ), పుణె మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎంఆర్డీఏ), మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ(ఎంఐడీసీ)లోని అగ్నిమాపక విభాగాల సారథులు ఈ దర్యాప్తు బృందంలో ఉన్నారు.
ఇదీ చదవండి:'సీరం' అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి