దిల్లీలో 56 శాతం మంది ప్రజల్లో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది. దేశ రాజధానిలో ఇటీవల నిర్వహించిన సెరోలాజికల్ సర్వేలో ఈమేరకు వెల్లడైనట్లు దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు.
నైరుతి దిల్లీలో అత్యధికంగా 62.18శాతం మంది కరోనాతో ప్రభావితమవగా... ఉత్తర దిల్లీలో అత్యల్పంగా 49.09శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు కనిపించినట్లు జైన్ వెల్లడించారు.
జనవరి 15 నుంచి 23 వరకు దిల్లీలోని వేర్వేరు జిల్లాల్లోని 28 వేల మంది ప్రజల శాంపిళ్లు సేకరించి ఈ సర్వే నిర్వహించారు.