దిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద సాగు చట్టాలపై ఉద్యమిస్తున్న ఆందోళనల్లో మరో రైతు మరణించాడు. పంజాబ్‌కు చెందిన 72 ఏళ్ల హన్సా సింగ్ గుండెపోటుతో గురువారం మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. పోస్ట్ మార్టమ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
గత ఏడాది నవంబర్ నుంచి వేలాది రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. దిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద నిరసనలు చేపడుతున్నారు. వ్యవసాయ చట్టాల వల్ల ధాన్యానికి మద్దతు ధర కోల్పోతామని, వ్యవసాయం కార్పొరేట్ల చేతుల్లోకి వెళుతుందని ఆరోపిస్తున్నారు. చట్టాల వల్ల రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్రం వాదిస్తోంది. వ్యవసాయ రంగంలోకి సరికొత్త టెక్నాలజీ వస్తుందని అంటోంది.
ఇదీ చదవండి: రాహుల్ దేశ వినాశకారిగా మారుతున్నారు: నిర్మల