Abdullahpurmet Murder Case update : తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో నిందితుడు హరిహరకృష్ణ ప్రవర్తనపై లోతుగా విచారిస్తున్నారు. నిందితుడు హరిహర కృష్ నవీన్‌పై మూడు నెలల నుంచే కక్ష పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం ఫిబ్రవరి 17 అర్ధరాత్రి అత్యంత కిరాతకంగా హత్య చేశాడని వెల్లడించారు. అయితే అతి కిరాతకంగా గుండె పెకిలించేంత దారుణానికి పాల్పడడంతో
Hariharakrishna custody news : అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో నవీన్ కిందపడగానే హరిహర కృష్ణ అతని గొంతు నులిమి ఊపిరాడకుండా చేశాడు. మృతి చెందాడని నిర్ధారించుకున్నాక నవీన్ చేతి వేళ్లు, మర్మాంగాలు కోసేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని గుర్తు పట్టలేని విధంగా చేశాడు. పగ, కోపం ఉంటే మృతి చెందాక వదిలి వేసేవాడు. శరీర భాగాలను తొలగించేంత ఉన్మాదం... గంజాయి లేదా మాదకద్రవ్యాలు సేవించడం వచ్చి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
హత్య విషయాన్ని బ్రాహ్మణపల్లికి చెందిన స్నేహితుడు హసన్, ప్రేమించిన యువతికి... హరిహర కృష్ణ చెప్పాడు. దారుణం గురించి తెలిసినా.... వీరిద్దరు ఎందుకు తమకు సమాచారం ఇవ్వలేదనే విషయంపై... పోలీసులు దృష్టి సారించారు. ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్న పోలీసులు ముగ్గురు హరిహరకృష్ణకు సహకరించారని భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో విచారణకు ఆ ముగ్గురు అసలు కాస్త కూడా సహకరించడం లేదని పోలీసులు అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ఇప్పటికే పోలీసులు హరిహరకృష్ణకు షెల్టర్ ఇచ్చిన హసన్‌ను విచారించారు. యువతిని ప్రశ్నించేందుకు సిద్దం కాగా.. ఈ కేసులోకి తనను లాగితే ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించినట్టు తెలుస్తోంది. సదరు యువతి హత్యను చాలా తేలికగా తీసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. సఖి సెంటర్‌లో కౌన్సెలింగ్ ఇప్పించినా విచారణకు సహకరించకపోవడం పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది.
నిందితుడిని 8 రోజుల కస్టడీ కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టులో ఎల్బీనగర్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సీన్ రీకన్‌స్ట్రక్చన్ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కోర్టుకు వివరించారు. హరిహరకృష్ణ కస్టడీపై ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది. హత్య గురించి తెలిసినా.. వారు ఎందుకు బయటకు చెప్పలేదనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దారుణ హత్య కేసులో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు ముమ్మరంగా శోధిస్తున్నారు.
ఇవీ చదవండి : నవీన్ హత్య కేసు.. 3 సార్లు ప్రశ్నించినా నోరువిప్పని స్నేహితురాలు..!
'ఆ నలుగురిని వదలొద్దు..' సాత్విక్ సూసైడ్ నోట్లో విస్తుపోయే విషయాలు