ETV Bharat / bharat

భారత్​- అమెరికా​ సంబంధాలపై ఉన్నతస్థాయి భేటీ

భారత్​, అమెరికా మధ్య కీలక రంగాల్లో సహకారంపై ఉన్నతస్థాయి అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. నాలుగో విడత 2+2 మంత్రుల సమావేశం సన్నద్ధత సహా రక్షణ, ప్రజారోగ్యం, ఆర్థిక రంగాలపై చర్చించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇండో పసిఫిక్​ ప్రాంతంలో శాంతి, సుస్థిరతపైనా మాట్లాడినట్లు పేర్కొంది.

Senior officials of India, US review ties
భారత్​- యూఎస్ సమావేశం
author img

By

Published : Sep 2, 2021, 10:43 PM IST

భారత్​, అమెరికా మధ్య మరికొద్ది రోజుల్లో జరగనున్న నాలుగో విడత 2+2 మంత్రుల స్థాయి సమావేశానికి ముందు ఇరు దేశాల ఉన్నతాధికారులు వాషింగ్టన్​లో సమావేశమయ్యారు. మంత్రుల సమావేశం సన్నద్ధపై సమీక్షతో పాటు రక్షణ, ప్రజారోగ్యం, ఆర్థిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పురగోతిపై ఇరు దేశాల అధికారులు బుధవారం చర్చించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.

దక్షిణాసియా, ఇండో పసిఫిక్​ ప్రాంతాలతో పాటు పశ్చిమ హిందూ మహాసముద్రంలో ఇటీవలి పరిస్థితులపై అంచనాలను ఇరు దేశాలు అందించుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే.. 2020, అక్టోబర్​లో జరిగిన 2+2 మంత్రుల స్థాయి సమావేశం తర్వాత పురోగతిపైనా చర్చించినట్లు పేర్కొంది.

"దక్షిణాసియా, ఇండోపసిఫిక్​, పశ్చిమ హిందూ సముద్రంలోని తాజా పరిస్థితులు, ఈ ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం తమ ప్రణాళికలను పంచుకున్నారు. రక్షణ, ప్రజారోగ్యం, ఆర్థికం, వాణిజ్య సహకారం, సైన్స్​ అండ్​ టెక్నాలజీ, స్వచ్ఛ ఇంధనం, వాతావరణ పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలపై సహకారాన్ని పెంపొందించేందుకు ఉన్న అవకాశాలపైనా చర్చించారు. అలాగే.. అంతరిక్షం, సైబర్​ సెక్యూరిటీ, భవిష్యత్తు సాంకేతికత వంటి రంగాలపైనా చర్చించారు. "

- భారత విదేశాంగ శాఖ.

ఈ సమావేశంలో.. అమెరికాలో భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి వాణీ రావు, రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి సోమ్​నాథ్​ ఘోష్​ల నేతృత్వంలో అధికారులు పాల్గొన్నారు.

మూడో దశ 2+2 విదేశాంగ, రక్షణ శాఖ మంత్రుల స్థాయి సమావేశం భారత్​లో గతేడాది జరిగింది. నాలుగో విడత సమావేశం వాషింగ్టన్​లో జరగనుంది.

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్​తో సమావేశమయ్యారు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్​ ష్రింగ్లా. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, అఫ్గాన్​ పరిస్థితులపై చర్చించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్​ బాగ్చీ తెలిపారు.

ఇదీ చూడండి: భారత్, అమెరికా 2+2 చర్చలకు రంగం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.