బంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యజిత్ బిస్వాస్ హత్య కేసు నిందితుడిగా భాజపా సీనియర్ నేత ముకుల్ రాయ్ పేరు నమోదైంది. ఈ మేరకు సీఐడీ శనివారం స్థానిక కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎమ్మెల్యే హత్యకు ప్రధాన కుట్రదారు ముకుల్‌రాయ్ అని అందులో పేర్కొంది.
ఈ విషయంపై భాజపా మండిపడింది. సీఐడీ చర్య వెనుక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుట్ర ఉందని భాజపా అధికార ప్రతినిధి కైలాశ్ విజయ్‌వర్గియా ఆరోపించారు. రాజకీయాల్లో హింసను తానెప్పుడూ ప్రోత్సహించలేదంటూ ముకుల్‌రాయ్ స్పందించారు. బంగాల్‌లో ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ప్రయత్నమే కనిపిస్తోందన్నారు.
ఇదీ చూడండి: పట్టు వీడని రైతన్న- 11వ రోజుకు చేరిన ఆందోళనలు