ETV Bharat / bharat

సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు కొనసాగింపుపై శివసేన విమర్శలు - సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు

కరోనా సమయంలోనూ.. సెంట్రల్​ విస్టా ప్రాజెక్టును కేంద్రం కొనసాగిస్తుండటంపై శివసేన తీవ్ర విమర్శలు చేసింది. మాజీ ప్రధానుల కృషి వల్లే.. దేశంలో ఏర్పడ్డ పరిస్థితులను ఎదుర్కోగలుగుతున్నామని తెలిపింది.

shiv sena on central vista, సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు
సెంట్రల్​ విస్టాపై శివసేన
author img

By

Published : May 8, 2021, 1:35 PM IST

కరోనాతో సతమతమవుతున్న భారత్​కు సాయం అందించడానికి పేద దేశాలు కూడా సిద్ధమవుతున్నాయని.. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం సెంట్రల్​ విస్టా ప్రాజెక్టును రద్దు చేసేందుకు సిద్ధంగా లేదని శివసేన మండిపడింది. గత 70ఏళ్లలో నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్​ వంటి నేతలు నిర్మించిన వ్యవస్థ కారణంగానే ప్రస్తుత పరిస్థితులను దేశం ఎదుర్కోగలుగుతోందని తెలిపింది. ఆ పార్టీకి చెందిన సామ్నా పత్రికలో ఈ వ్యాఖ్యలు చేసింది.

"భారత్​లోని పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ఆ దేశాన్ని ఆదుకోవాలంటూ ఇటీవల యూనిసెఫ్​ పేర్కొంది. బంగ్లాదేశ్​, భూటాన్​, నేపాల్​, మయన్మార్​, శ్రీలంక దేశాలు భారత్​కు సాయపడేందుకు సిద్ధమయ్యాయి. ఒకప్పుడు పాకిస్థాన్​, కాంగో వంటి దేశాలకు ఈ పరిస్థితి ఉండేది. ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల కారణంగా మనకూ ఇప్పుడు ఈ పరిస్థితి పట్టింది. ఈ సమయంలో కూడా రూ.20వేల కోట్లు విలువ చేసే సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు కొనసాగింపుపై ఎవరికీ చింత లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది."

-శివసేన

ప్రపంచం కరోనా రెండో దశపై పోరాడుతుంటే.. కేంద్రం మాత్రం ఇంకా బంగాల్​ రాజకీయాలపైనే దృష్టి సారిస్తోందని శివసేన పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులపై అవగాహన ఉన్న ఏ ప్రభుత్వమైనా రాజకీయాల గురించి ఆలోచించదని, ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి అఖిలపక్షాలతో కలిసి చర్చించేదని వ్యాఖ్యానించింది. 'ఆరోగ్య శాఖ మంత్రిగా నితిన్​ గడ్కరీకి బాధ్యతలు అప్పజెప్పాలని భాజపా ఎంపీ సుబ్రమణియన్​ స్వామి ఇటీవల కేంద్రానికి సూచించారు. ప్రస్తుత ఆరోగ్య మంత్రి విఫలమయ్యారు అనడానికి ఇదే రుజువు' అని శివసేన పేర్కొంది.

ఇదీ చదవండి : ఆవిష్కరణలతో ఒడిశా ఐన్​స్టీన్ ప్రపంచ రికార్డులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.