టీ20 ప్రపంచకప్‌లో(T-20 World Cup) భాగంగా ఇటీవల జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో((india pak match)) పాక్ జట్టు విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ పలువురు సంబరాలు చేసుకోవడం(pakistan win celebrated in india) ప్రకంపనలు సృష్టిస్తోంది. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఓ ప్రైవేటు ఉపాధ్యాయురాలు సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. జమ్ముకశ్మీర్‌లో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా దీనిపై స్పందించిన ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్.. పాక్ గెలుపుపై సంబరాలు చేసుకుంటున్న వారిపై దేశద్రోహం కేసులు(Sedition law) నమోదు చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు భారత క్రికెట్ జట్టుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు(pakistan win celebrated in india) చేసిన ఐదుగురిని కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బదాయూకు చెందిన నియాజ్ అనే వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేసినట్లు సీనియర్ ఎస్పీ ఓపీ సింగ్ తెలిపారు. మ్యాచ్ ముగిసిన తరువాత పాకిస్థాన్ జెండాను ఫేస్బుక్లో పోస్ట్ చేసి, ఆ దేశానికి మద్దతుగా పలు వ్యాఖ్యలు జోడించినట్లు చెప్పారు. అతనిపై దేశ ద్రోహం కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.
మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ జట్టు విజయం నేపథ్యంలో వ్యాఖ్యలు చేసిన ఏడుగురిపై ఆగ్రా, బరేలి, సీతాపుర్‌లో మొత్తం 5 కేసులు నమోదైనట్టు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. వీరిలో ఆగ్రాలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న ముగ్గురు కశ్మీర్ విద్యార్థులు కూడా ఉన్నారు.
రాజస్థాన్‌లో..
రాజస్థాన్‌లోని జోధ్‌పుర్, పిపర్‌లో కొంత మంది పాకిస్థాన్ విజయంపై సామాజిక మాధ్యమాల్లో సంబరాలు చేసుకోగా(pakistan win celebrated in india).. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్దుల్ రషీద్ అనే వ్యక్తికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా అతనికి కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ వాట్సాప్‌లో అభ్యంతరకర స్టేటస్ పెట్టిన ప్రైవేటు ఉపాధ్యాయిని నఫీసాను రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ పోలీసులు బుధవారమే అరెస్టు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ నఫీసా వీడియో విడుదల చేశారు. నఫీసాకు వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నఫీసాను ఆమె పనిచేస్తున్న నీరజా మోదీ పాఠశాల యాజమాన్యం ఇప్పటికే ఉద్యోగం నుంచి తొలగించింది.
భిన్న వాదనలు..
సామాజిక మాధ్యమాల్లో పాక్ విజయాన్ని స్వాగతిస్తూ వ్యాఖ్యలు చేసినవారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ ఒకవైపు ఉంటే ఆటలో ఒక జట్టుకు మద్దతు ప్రకటించడం ఎందుకు తప్పవుతుందని ప్రశ్నిస్తూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ అరెస్టులను పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సహా పలువురు జమ్ముకశ్మీర్ నాయకులు ఇప్పటికే ఖండించారు. ముఫ్తీది తాలిబన్ మనస్తత్వమని, పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన వారికి జైలు తప్పదని జమ్ముకశ్మీర్ భాజపా అధ్యక్షుడు రవీందర్ రైనా విమర్శించారు.
ఇదీ చూడండి: భారత్-పాక్ మ్యాచ్‌లో ఓటమిపై విద్యార్థుల ఫైట్