ETV Bharat / bharat

రిపబ్లిక్​ డే- దేశ రాజధానిలో పటిష్ఠ భద్రత

రిపబ్లిక్​ డేను పురస్కరించుకొని దిల్లీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. రైతు సంఘాల భారీ ట్రాక్టర్​ ర్యాలీ కూడా ఉన్నందున పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

author img

By

Published : Jan 25, 2021, 10:55 PM IST

security tightened in delhi ahead of  republic day and tractor rally
రిపబ్లిక్​ డే- దేశ రాజధానిలో పటిష్ఠ భద్రత

దిల్లీ పోలీసులకు మంగళవారం ఓ పెద్ద సవాల్‌గా మారింది. ఓ వైపు రిపబ్లిక్‌ డే వేడుకలు.. మరోవైపు, రైతు సంఘాలు తలపెట్టిన భారీ ట్రాక్టర్‌ పరేడ్‌.. దీంతో దేశ రాజధానిలో ఎటు చూసినా పోలీసులే..! ఈ రెండు ఈవెంట్లు ఒక్కరోజే ఉండటంతో అప్రమత్తమైన పోలీసులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజ్‌పథ్‌ వద్ద మంగళవారం జరిగే రిపబ్లిక్‌ డే వేడుకల కోసం 6 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు వింటేజ్‌ పాయింట్లలో ఫేషియల్‌ రికగ్నేషన్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. అలాగే, రాజ్‌ఘాట్‌ వద్ద చురుకైన సిబ్బందిని పీపీఈ కిట్లు, మాస్క్‌, ఫేష్‌ షీల్డ్‌లతో మోహరిస్తున్నామని తెలిపారు. రాజ్‌పథ్‌ నుంచి కవాతు జరిగే దాదాపు 8 కి.మీల మార్గంలో నిఘా ఉంచేందుకు వీలుగా ఎత్తైన భవనాలపై షార్ప్‌షూటర్లు, స్నీపర్స్‌ గస్తీ కాస్తారన్నారు. దిల్లీ చుట్టూ సరిహద్దు ప్రాంతాల వద్ద ఐదంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

25వేల మంది మాత్రమే

ఏటా రిపబ్లిక్‌డే వేడుకలకు లక్ష మందికి పైగా హాజరైనప్పటికీ ఈసారి మాత్రం కరోనా నిబంధనలకు అనుగుణంగా కేవలం 25వేల మంది మాత్రమే హాజరవుతారని పోలీసులు తెలిపారు. ఎర్రకోట వరకు జరగాల్సిన పరేడ్‌ కూడా నేషనల్‌ స్టేడియం వరకే నిర్వహించనున్నారు. ఎర్రకోట వద్ద కేవలం శకటాలకు మాత్రమే అనుమతించనున్నారు. రిపబ్లిక్‌ డే పరేడ్‌ జరిగే ప్రదేశంలో 140 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. రాజ్‌పథ్‌లోకి జనం ప్రవేశించే పాయింట్ల వద్ద 30 చోట్ల ఫేషియల్‌ రికగ్నేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. ఈ వ్యవస్థలో దాదాపు 50వేల మందికి పైగా అనుమానిత ఉగ్రవాదులు, నేరస్థులు, సంఘవిద్రోహక శక్తులకు సంబంధించిన డేటాబేస్‌ ఉంటుందని చెప్పారు.

ట్రాక్టర్ల పరేడ్‌

మరోవైపు, కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు రెండు నెలలకు పైగా ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులు రేపే ట్రాక్టర్ల పరేడ్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దేశ రాజధాని సరిహద్దుల్లోని మూడు ప్రాంతాల నుంచి బయల్దేరే ఈ ట్రాక్టర్ల ర్యాలీ సెంట్రల్‌ దిల్లీలోకి ప్రవేశించదని రైతు సంఘాల నేతలు స్పష్టంచేశారు. అలాగే, రిపబ్లిక్‌డే పరేడ్‌ పూర్తయిన తర్వాతే తమ ట్రాక్టర్ల పరేడ్‌ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. తమ పరేడ్‌లో 2లక్షల ట్రాక్టర్లతో రైతులు పాల్గొంటారని భావిస్తున్నట్టు నేతలు తెలిపారు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌ (యూపీ గేటు) ఈ మూడు సరిహద్దు పాయింట్ల నుంచి ట్రాక్టర్లు దిల్లీకి వెళ్తాయని తెలిపారు. అయితే, అన్నదాతల ట్రాక్టర్‌ పరేడ్‌లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే పలు సరిహద్దు పాయింట్ల వద్ద భద్రతా సిబ్బందిని మోహరించినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి : ఈ ఏడాది 'పద్మం' వరించింది వీరినే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.