ETV Bharat / bharat

రైతుల కట్టడికి మేకులు, కంచెలు, గోడలు!

సాగు చట్టాల రద్దు కోసం ఉద్యమిస్తున్న రైతుల దీక్షా స్థలాలైన దిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా భారీగా బలగాలు మోహరించారు. బారికేడ్లు, ఇనుప కంచె, ట్రాక్టర్లు వెళ్లకుండా రోడ్డుపై ఇనుప మేకులను ఏర్పాటు చేశారు. మరోవైపు ఆందోళన కొనసాగిస్తున్న రైతులు,  ఈ నెల 6న దేశవ్యాప్తంగా రాస్తారోకోకు పిలుపునిచ్చారు.

security tightened at delhi borders where farmers protesting
దిల్లీ సరిహద్దులో భద్రత కట్టుదిట్టం- ట్రాఫిక్​కు అంతరాయం
author img

By

Published : Feb 2, 2021, 1:10 PM IST

Updated : Feb 2, 2021, 1:51 PM IST

పార్లమెంటు సమావేశాల దృష్ట్యా... సాగుచట్టాలపై రైతులు నిరసన చేస్తున్న దిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు భారీగా భద్రతాబలగాలను మోహరించారు. ఫలితంగా దిల్లీలోని పలుప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆయా ప్రాంతాలకు బదులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటూ దిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు ట్వీట్‌ చేశారు.

సింఘు సరిహద్దు వద్ద రెండు వరుసలుగా సిమెంటు బ్యారియర్లను ఏర్పాటు చేశారు. సింఘు నుంచి దిల్లీలోనికి ప్రవేశించనీయకుండా సిమెంటుతో గోడను నిర్మించారు. ప్రధాన ప్రవేశ ప్రాంతాలకు అడ్డుగా బస్సులు పెట్టడం సహా రోడ్డుకు ఓ వైపు పెద్ద పెద్ద మేకులు కొట్టారు. ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో మంగళవారం రాత్రి వరకు అంతర్జాల సేవలు నిలిపివేశారు. నిరసనకారులను గుర్తించేందుకు డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు.

శివసేన సంఘీభావం..

దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు శివసేన ఎంపీలు సంఘీభావం తెలిపారు. ఘాజిపూర్ సరిహద్దుకు వెళ్లి తమ మద్ధతు ప్రకటించారు. సంజయ్​ రౌత్ సహా, మొత్తం ఆరుగురు శివసేన ఎంపీలు బీకేయూ నేత రాకేశ్ తికాయత్​ను ఘాజిపుర్ సరిహద్దులో కలిశారు. అనంతరం కేంద్రం రైతులతో సరైన పద్ధతిలో చర్చలు జరపాలని రౌత్​ అన్నారు. అహంకార వైఖరిని వీడనాడాలన్నారు.

మరోవైపు దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన 69వ రోజుకు చేరింది. భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేష్‌ తికాయిత్​‌ భావోద్వేగ వేడుకోలుతో రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ నుంచి రైతులు భారీగా దిల్లీ-యూపీ సరిహద్దు వద్దకు చేరుకుంటున్నారు. బడ్జెట్ కేటాయింపుల కన్నా చట్టాల రద్దే ముఖ్యమని అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నెల 6న దేశవ్యాప్తంగా.. రాస్తారోకోకు రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. 'చక్కా జామ్'‌ పేరుతో ఆరోజు జాతీయ, రాష్ట్ర రహదారుల దిగ్బంధనం చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: గోడలు కాదు.. వంతెనలు నిర్మించండి: రాహుల్​

Last Updated : Feb 2, 2021, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.