Rahul Gandhi Ludhiana Rally: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అధికారులు షాక్‌కు గురిచేసింది. ఆయన ప్రయాణిస్తున్న కారుపైకి ఓ యువకుడు జెండా విసిరేశాడు. ఆదివారం పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు రాహుల్ లుధియానా వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది.
ఏం జరిగింది..
రాహుల్ హల్వారా నుంచి లుధియానాలో హయత్ రిజెన్సీ హోటల్‌కు వెళ్లే క్రమంలో హర్షిలా రిసార్ట్ చేరుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. దీంతో కారు అద్దాలు తీసి రాహుల్ అభివాదం చేశారు. ఈ సమయంలోనే ఓ వ్యక్తి జెండాను రాహుల్ కారుపైకి విసిరాడు. రాహుల్ వెంటనే కిటికీ అద్దాలు మూసేశారు. ఈ సమయంలో రాహుల్ ప్రయాణిస్తున్న కారును కాంగ్రెస్ సీనియర్ నేత సునీల్ జఖార్ డ్రైవ్ చేస్తున్నారు. నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ, సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ కూడా కారులోనే ఉన్నారు.
Rahul Gandhi Punjab
ఈ ఘటన చూసి అధికారులు ఉలిక్కిపడ్డారు. జెండా విసిరిన యువకుడు ఎన్ఎస్యూఐ కార్యకర్త అని, అతడు జమ్ముకశ్మీర్‌కు చెందిన వాడని తెలిపారు.
జనవరి 5న పంజాబ్ ఫిరోజ్పుర్లో ర్యాలీ హాజరయ్యేందుకు వెళ్లిన ప్రధాని మోదీ పర్యటనలోనూ భద్రతా లోపం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన కాన్వాయ్ వెళ్లే రోడ్డును నిరసనకారులు దిగ్భందించారు. దీంతో 20 నిమిషాల పాటు మోదీ కారులోనే ఉండిపోయారు. అనంతరం ర్యాలీకీ వెళ్లకుండా దిల్లీకి తిరుగుముఖం పట్టారు. ఈ ఘటనపై కాంగ్రెస్, భాజపా మధ్య మాటల యుద్ధం జరిగింది.
ఇదీ చదవండి: 'మంచి రోజులు ఎవరికి?'.. కేంద్రంపై రాహుల్ ఫైర్!