ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా బస్టాండ్ సమీపంలో శుక్రవారం ఉదయం అనుమానిత ఉగ్రవాదులు భద్రతా దళాలపై గ్రెనేడ్లు విసిరారు. ఈ ఘటనతో అప్రమత్తమైన బలగాలు వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆ గ్రెనేడ్ పేలకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ, అస్తి నష్టం వాటిల్లలేనదని స్థానిక ఎస్ఎస్పీ అంబార్కర్ శ్రీరామ్ దిన్కర్ పేర్కొన్నారు.
ఈ నెలారంభంలో.. ఓ ఉగ్ర సహాయకుడు ముజామిల్ ఖాదిర్ భట్‌ను కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి జైషే మహ్మద్‌కు చెందిన ఆయుధ సామగ్రి, ఓ హ్యాండ్ గ్రెనేడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, 42 రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)కు చెందిన 180 బెటాలియన్ల బృందం.. సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది.
ఇదీ చదవండి: భారత్‌లో ఉండేందుకు జపనీయుడి 'కుర్చీ' ప్లాన్