కొవిడ్ టీకా రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. టీకా మొదటి డోసు తీసుకుని, 28 రోజుల పూర్తైన లబ్ధిదారులకు రెండో డోసు అందించామని చెప్పింది. శనివారం ఒక్కరోజే(సాయంత్రం 6 గంటలలోపు) 84,807 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 80,52,454 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. టీకా తీసుకున్నాక వివిధ కారణాల వల్ల 27 మంది మరణించారని వెల్లడించింది. గత 24 గంటల్లో 3 మరణాలు నమోదయ్యాయని చెప్పింది. అయితే.. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎలాంటి తీవ్ర ప్రతికూలతలు ఎదురుకాలేదని, టీకా తీసుకోవడం వల్ల మాత్రమే ఎవరూ చనిపోలేదని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:ప్రపంచానికి భారత్ టీకా.. లెక్క ఎంతంటే?