ETV Bharat / bharat

'వ్యవసాయంపై కొవిడ్​ 2.0 ప్రభావం ఉండదు'

కొవిడ్​ రెండో దశ వ్యాప్తి భారత వ్యవసాయ రంగంపై ఏ విధంగానూ ప్రభావం చూపదని తెలిపింది నీతి ఆయోగ్​. మే నెలలో పల్లెలకూ వైరస్​ వ్యాప్తి చెందినప్పటికీ.. ఆ సమయంలో వ్యవసాయ పనులు చాలా తక్కువని పేర్కొంది. మార్కెట్లు సాధారణంగానే పని చేశాయని స్పష్టం చేసింది.

NITI Aayog
నీతి ఆయోగ్​ సభ్యుడు రమేశ్​ చంద్​
author img

By

Published : Jun 6, 2021, 4:51 PM IST

రెండో దశలో కొవిడ్​ మహమ్మారి పల్లెలకూ వ్యాపించింది. మే నెలలో వైరస్​ వ్యాప్తి అధికంగా ఉంది. అయితే.. కొవిడ్​-19 రెండో దశ భారత వ్యవసాయ రంగంపై ఏ విధంగానూ ప్రభావం చూపదని తెలిపారు నీతి ఆయోగ్​ సభ్యుడు రమేశ్​ చంద్​. భారత్​ అవలంబిస్తున్న రాయితీ, ధర, సాంకేతిక విధానాలు.. వరి, గోధుమ, పంచదార పంటలకు అత్యంత అనుకూలంగా ఉన్నాయన్నారు. అలాగే.. పప్పు దినుసులకు కనీస మద్దతు ధర, కొనుగోలు విధానాలను తీసుకురావాల్సి ఉందని సూచించారు.

"మే నెలలో కొవిడ్​-19 గ్రామీణ ప్రాంతాలకు వ్యాప్తి చెందటం మొదలైంది. మే నెలలో వ్యవసాయ పనులు తక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా భూమి ఆధారిత పనులు. ఈ నెలలోనే ఎండలు మండిపోతాయి. ఈ సమయంలో ఎలాంటి పంట పండదు. చిన్నపాటి కూరగాయలు, సీజనల్​ పంటలు తప్ప ఇతర ప్రధాన పంటలు పండించరు. మార్చి​ లేదా ఏప్రిల్​ అర్ధభాగంలో పంటలు అధికంగా సాగవుతాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గి.. మళ్లీ వర్షకాలంలో ప్రారంభమవుతాయి. మే నుంచి జూన్​ అర్ధభాగం వరకు కూలీల కొరత ఉన్నప్పటికీ.. వ్యవసాయంపై కరోనా ఏ విధంగానూ ప్రభావం చూపదని నా ఆలోచన. "

-రమేశ్​ చంద్​, నీతి ఆయోగ్​ సభ్యుడు

పట్టణాల్లో కొవిడ్​ ఉద్ధృతితో కూలీలు గ్రామాలు వెళ్లారని, వారంతా వ్యవసాయ పనులు చేసేందుకే మొగ్గుచూపుతారని తెలిపారు రమేశ్​. దిగుబడి పరంగా చూసుకున్నా.. ఎలాంటి క్షీణత లేదని, మార్కెట్​ సమాచారం చూస్తే సాధారణంగానే పని చేసినట్లు తెలుస్తుందని గుర్తు చేశారు.

ఇదీ చూడండి: ఇదొక సూపర్​ స్పెషల్ బీర్- ధర రూ.60!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.