మోదీ డిబ్బీ.. రూ.లక్ష దాయొచ్చట! - డిబ్బీల పరిశ్రమ
మనలో చాలామంది ఇళ్లల్లో చిల్లర దాచుకునేందుకు డిబ్బీలు ఉంటాయి. మట్టితో, ప్లాస్టిక్‌తో, వివిధ ఆకృతుల్లో తయారయ్యే అనేకం మార్కెట్లోనూ దర్శనమిస్తుంటాయి. అయితే.. ప్రధాని నరేంద్రమోదీ ప్రతిమనే డిబ్బీలాగా రూపొందిచాడో శిల్పి. పెద్దలకు పొదుపు మంత్రంతో పాటు.. పిల్లలు మోదీ గొప్పతనాన్ని తెలుసుకుంటారనే ఉద్దేశంతో తయారుచేశానని చెబుతున్నాడు బిహార్‌కు చెందిన జై ప్రకాశ్.

బిహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన ఓ కళాకారుడు డిబ్బీలను తయారు చేస్తున్నాడు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహాలతో వీటిని రూపొందించాడు ఆయన. దాదాపు లక్ష రూపాయల వరకు నాణేలు, నోట్లను దాచుకోవచ్చని తెలిపాడు. గతేడాది 'జనతా కర్ఫ్యూ' సమయంలో వచ్చిన ఆలోచనతో వీటిని తయారు చేసి మార్కెట్లో విక్రయించడం మొదలుపెట్టాడు.


"ప్రపంచంలోనే అత్యుత్తమమైన మన దేశ ప్రధాని గురించి పిల్లలకు తెలిపేందుకే ఈ ప్రయత్నం" అని జై ప్రకాశ్ తెలిపాడు. వీటిని రూపొందించేందుకు ఒక నెల సమయం పట్టిందని చెప్పాడు.

"దేశాన్ని మహమ్మారి నుంచి కాపాడేందుకు మోదీ ప్రయత్నించారు. నా వంతుగా ప్రజలకు డబ్బు ఆదా చేసే ఆలోచన కలిగించేలా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. అంతేగాక.. పిల్లలు మోదీ గొప్పతనం గురించి తెలుసుకొని ప్రేరణగా తీసుకుంటారని భావిస్తున్నా."
-జై ప్రకాశ్, మోదీ డిబ్బీల రూపకర్త

ఇవీ చదవండి: