ETV Bharat / bharat

గంగానదిలో భారీగా మృతదేహాలు.. ఏం జరిగింది?

బిహార్​ బక్సార్​ జిల్లాలోని గంగానదిలో వందల సంఖ్యలో మృతదేహాలు బయటపడటం కలకలం రేపింది. జిల్లాలోని మహాదేవ్ ఘాట్ వద్ద కుళ్లిన స్థితిలో బయటపడ్డ మృతదేహాలను కుక్కలు పీక్కుతింటున్న దృశ్యాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై బక్సార్ జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.

hundreads of dead bodies floated in ganga river
గంగానదిలో వందల మృతదేహాలు
author img

By

Published : May 10, 2021, 7:19 PM IST

Updated : May 10, 2021, 8:04 PM IST

గంగానదిలో భారీగా మృతదేహాలు

బిహార్​ బక్సార్ జిల్లా​ సమీపంలోని గంగానదిలో వందల సంఖ్యలో కుళ్లిన మృతదేహాలు తేలటం కలకలం రేపింది. బక్సార్​లోని మహదేవ్​ ఘాట్​ వద్ద కుళ్లిన మృతదేహాలను కుక్కలు పీక్కుతింటున్న దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనపై బక్సార్ జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.

" ఇది అతిపెద్ద విషాదం. ఉత్తర్​ ప్రదేశ్​కు చెందిన బీర్​పుర్​, బరేగామ్ గ్రామాలు గంగానది ఒడ్డున ఉన్నాయి. 400 నుంచి 500 మృతదేహాలు కుళ్లిన స్థితిలో బక్సార్​లోని మహాదేవ్​ ఘాట్​ వద్దకు కొట్టుకొచ్చినట్లు స్థానిక గ్రామస్థులు తెలిపారు. కానీ సీఈఓ, నా బృందం 40 నుంచి 50 మృతదేహాలను ఇక్కడ చూశాం. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తాం."

-- అశోక్​ కుమార్, చౌసా బీడీఓ

" ఈ మృతదేహాలు గత 5-7 రోజుల నుంచి నీటిలో తేలియాడుతున్నట్లుగా ఉంది. మృతదేహాలను నదిలో పడేసే ఆచారం మనకు లేదు. వీటిని ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ మృతదేహాలు వారణాసి, అలహాబాద్ లేదా ఇతర ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చాయా? అనే విషయంపై దర్యాప్తు చేపట్టాం. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఘాట్​ వద్ద అధికారులను అప్రమత్తం చేశాం."

-- కేకే ఉపాధ్యాయ, బక్సార్ ఎస్​డీఓ

అయితే ఈ మృతదేహాలను గంగానది పరివాహక గ్రామాల్లోని ప్రజలు పడేసారని స్థానికులు తెలిపారు. అంత్యక్రియల్లో భాగంగా స్థానిక గ్రామాల ప్రజలు మృతదేహాలను నదిలో పడేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

" ఇవి కొవిడ్-19తో ఇటీవల మరణించినవారి మృతదేహాలు. ఆస్పత్రుల్లో పడకల కొరత కారణంంగా.. వైద్య చికిత్స అందక ఇంట్లోనే మరణించారు."

-- రామ్​ప్యారే, స్థానికుడు

ఇదీ చదవండి : వరుడు రెండో ఎక్కం చెప్పలేదని పెళ్లి రద్దు

Last Updated : May 10, 2021, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.