ETV Bharat / bharat

'మోదీజీ హెల్ప్.. నా శరీరంలో చిప్ ఉంది- తీసేస్తే అంతే!' - చెన్నై సైంటిస్ట్ మైక్రోచిప్

'నేనో శాస్త్రవేత్తను. నా శరీరంలో అమెరికా నిఘా వర్గాలు మైక్రోచిప్​ను (Microchip in body) అమర్చాయి. నేను పెట్టుకున్న హెల్మెట్ తీసేస్తే శరీరంలో నుంచి వైబ్రేషన్లు వస్తాయి. నన్ను మోదీనే కాపాడాలి' అంటూ ఓ వ్యక్తి దిల్లీలోని లూటెన్స్​ ప్రాంతంలో తిరిగాడు. ఎవరా వ్యక్తి? అసలేంటీ కథ?

Scientist
సైంటిస్ట్ చిప్
author img

By

Published : Sep 12, 2021, 12:43 PM IST

దిల్లీ లూటెన్స్ (Lutyens Delhi) ప్రాంతం.. హై సెక్యూరిటీ జోన్​లో ఉన్న పాకిస్థాన్ హైకమిషన్ (Pak high Commission New Delhi) వద్ద ఓ 40 ఏళ్ల వ్యక్తి, ఆయన కుమారుడు వారం రోజుల నుంచి కార్​లోనే నివసిస్తున్నారు. గోపాలకృష్ణన్ అనే ఆ వ్యక్తి తనను తాను శాస్త్రవేత్తగా చెప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇన్నోవా కార్​ను అద్దెకు తీసుకొని.. చాణక్యపురిలోని నెహ్రూ పార్క్​ సమీపంలో ఏడు రోజుల నుంచి ఉంటున్నారని చెప్పారు. వారిద్దరి మానసిక పరిస్థితి బాగా లేదని.. అడిగిన ప్రశ్నలకు సైతం సరిగా సమాధానాలు చెప్పలేదని పేర్కొన్నారు.

తాము ఇటీవలే అమెరికా వెళ్లామని ఇరువురూ పోలీసులకు వివరించారు. అమెరికా భద్రతా ఏజెన్సీలు తమ శరీరాల్లో మైక్రోచిప్​లను (microchip in body) అమర్చారని చెప్పుకొచ్చారు. ఈ విషయమై.. ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించి భద్రత కోరేందుకు వచ్చామని, ఆయన నుంచి స్పందన రాలేదని పోలీసులతో చెప్పారు. అమెరికా-భారత్ మధ్య సంబంధాలపై ఫిర్యాదు చేసేందుకు దిల్లీ వచ్చినట్లు ఇరువురూ పేర్కొన్నారు. కార్​లో కూర్చున్న సమయంలోనూ వీరిద్దరూ హెల్మెట్లు ధరించారు. హెల్మెట్ తీసేస్తే శరీరంలో నుంచి వైబ్రేషన్లు వస్తాయని చెబుతున్నారు.

"వీరిద్దరికి మానసిక సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని పరీక్షిస్తాం. పాకిస్థాన్ ఎంబసీ సమీపంలోని పార్కింగ్ ప్రదేశంలో వారి కార్​ను నిలిపి ఉంచారు. నిర్లక్ష్యంగా ఉన్న ఇక్కడి బీట్ ఆఫీసర్ నార్సిరామ్​ను సస్పెండ్ చేశాం."

-పోలీసులు

వీరిద్దరి స్వస్థలం చెన్నైగా (Chennai scientist) గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. ఇద్దరినీ వారికి అప్పగించారు పోలీసులు. ఘటనపై తదుపరి విచారణ చేపడుతున్నారు.

ఇదీ చదవండి: పోలీస్​ స్టేషన్​లో రౌడీ బర్త్​డే వేడుకలు- వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.