School Teacher Kidnapped Forced To Marry In Bihar : ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి.. సినిమా స్టైల్లో తన కుమార్తె మెడలో బలవంతంగా తాళి కట్టించాడు కిడ్నాపర్. ఈ ఘటన బిహార్‌లోని వైశాలిలో జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు.. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వైశాలి జిల్లాకు చెందిన గౌతమ్ కుమార్.. ఇటీవలే బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అర్హత సాధించి పటేపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే నవంబర్ 29వ తేదీ మధ్యాహ్నం కారులో నలుగురు వ్యక్తులు వచ్చి.. గౌతమ్‌ను బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న గౌతమ్ కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. రాజేశ్ రాయ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు.
గతంలో రాజేశ్‌రాయ్.. తన కుమార్తె చాందినీని పెళ్లి చేసుకోవాల్సిందిగా గౌతమ్‌ను కోరాడని, అతడు తిరస్కరించడం వల్ల భౌతికదాడి కూడా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు. గౌతమ్ జాడను తెలుసుకున్న పోలీసులు వెళ్లి చూసే సరికి.. గౌతమ్, చాందినీల వివాహం జరిగిపోయింది. రాజేశ్.. వధూవరులిద్దరినీ తన ఇంట్లోనే బంధించాడు. పోలీసులు రాజేశ్, అతడి కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు.
యువకుడ్ని కిడ్నాప్ చేసి, ఆమెతో బలవంతంగా పెళ్లి- పదేళ్ల తర్వాత అతడికి హైకోర్టులో న్యాయం!
Patna High Court Cancelled Forcible Marriage : పదేళ్ల కిందట ఇలానే బిహార్‌లో బలవంతంగా ఓ యువకుడికి వివాహం జరిపించారు. అయితే ఇటీవలే ఆ వివాహం చెల్లుబాటు కాదని పట్నా హైకోర్టు తీర్పునిచ్చింది. యువకుడితో బలవంతంగా యువతి నుదిటిపై బొట్టు పెట్టించినంత మాత్రన అది వివాహం కాదని స్పష్టం చేసింది. 'హిందూ వివాహ చట్టంలోని నిబంధనలను పూర్తిగా పరిశీలిస్తే.. సప్తపది చుట్టూ వధువరులిద్దరూ ఏడడుగులు నడిచినప్పుడు మాత్రమే పెళ్లి పూర్తి అవుతుంది. అంతేగానీ సప్తపది పూర్తికాకపోయే.. ఆ వివాహం పరిగణనలోకి రాదు' అని స్పష్టం చేస్తూ.. బలవంతంగా జరిగిన ఈ వివాహాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
పెళ్లి మండపం నుంచి వరుడు పరార్.. 20కి.మీ వెంబడించిన వధువు.. చివరకు..
పేదలకు అండగా ట్రాన్స్‌జెండర్- ఏడాదికి 10మంది యువతులకు పెళ్లిళ్లు- గత 12 ఏళ్లుగా ఇలానే!