ETV Bharat / bharat

యూట్యూబ్​ చూసి బాంబుల తయారీ.. స్కూల్​ వ్యాన్​పై విద్యార్థుల ప్రయోగం.. చివరకు.. - బాంబు తయారుచేసిన విద్యార్థులు

యూట్యూబ్​లో వీడియోలు చూసి బాంబులను తయారు చేశారు ఆరుగురు విద్యార్థులు. ఈ బాంబులను ఆగి ఉన్న స్కూల్​ వ్యాన్​పై ప్రయోగించారు. ఈ ఘటన పుదుచ్చేరిలో జరిగింది.

students watching youtube to make bomb
యూట్యూబ్​ వీడియో చూసి బాంబు తయారీ
author img

By

Published : Jan 10, 2023, 5:41 PM IST

పుదుచ్చేరిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరుగురు మైనర్లు.. యూట్యూబ్​లో వీడియోలు చూసి బాంబులను తయారు చేశారు. వీరు తయారు చేసిన పేలుడు పదార్థాలను ఓ స్కూల్ వ్యాన్​పైకి విసిరారు. దీంతో వ్యాన్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన శాంతినగర్​లో ఆదివారం రాత్రి జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గులకరాళ్లు, బాణసంచా తయారీకి ఉపయోగించే మందుగుండు పొడితో ఆరుగురు మైనర్లు కలిసి పేలుడు పదార్థాలను తయారు చేశారు. యూట్యూబ్ వీడియోలను చూసి వీటిని తయారు చేయడం నేర్చుకున్నారు. ఆదివారం రాత్రి రోడ్డు పక్కన ఉన్న ఓ స్కూల్ వ్యాన్​పైకి ఓ బాంబును విసిరారు. ఆ బాంబు పేలి వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి.

పేలుడు శబ్దం విన్న స్థానికులు ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఘటనా స్థలిలో గులకరాళ్లు, మందుగుండు సామగ్రి తయారీకి ఉపయోగించే పదార్థాలు వారికి కనిపించాయి. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్నిఫర్ డాగ్​తో ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. పేలుడుకు కొద్ది నిమిషాల ముందు ఆరుగురు అక్కడి వచ్చినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.

"నిందుతులెవరికీ నేర చరిత్ర లేదు. ఒక్కరు తప్ప మిగతా వారందరూ ఆటో డ్రైవర్ల కుమారులే. నిందితులందరూ మైనర్లే. నిందితుల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల్లో ఇద్దరు పదో తరగతి, మరొకరు పాలిటెక్నిక్​, ఇంకొకరు బీఏ చదువుతున్నారు. మరో ఇద్దరు చదువు మానేశారు."

--పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.