ETV Bharat / bharat

చిన్నారిపై అత్యాచారం- ప్రిన్సిపల్​కు మరణశిక్ష - బిహార్​లో చిన్నారిపై అత్యాచారం

ఐదో తరగతి చిన్నారిని అత్యాచారం చేసిన పాఠశాల ప్రిన్సిపల్​కు మరణశిక్ష విధించింది బిహార్​ పోక్సో కోర్టు. మరో ఉపాధ్యాయునికి జీవితకాల శిక్ష విధించింది.

School principal gets death sentence for raping Class 5 student
చిన్నారిపై అత్యాచారం- ప్రిన్సిపల్​కు మరణశిక్ష
author img

By

Published : Feb 16, 2021, 11:03 AM IST

ఐదో తరగతి చదువుతోన్న చిన్నారిపై అత్యాచారం చేసి, ఆమె గర్భం దాల్చడానికి కారణమైన పాఠశాల ప్రిన్సిపల్​కు బిహార్​ పోక్సో కోర్టు మరణ శిక్ష విధించింది. మరో ఉపాధ్యాయునికి జీవితకాల శిక్ష విధించింది.

ఐదో తరగతి చదువుతోన్న 11ఏళ్ల చిన్నారిపై పట్నాలోని ఓ పాఠశాల ప్రిన్సిపల్​ అరవింద్​ కుమార్​, అభిషేక్​ కుమార్​ అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే బాలికకు ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆమె గర్భవతని వైద్యులు చెప్పారు. 2018 సెప్టెంబర్​లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రిన్సిపల్​ అరవింద్​ కుమార్​కు మరణశిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధించారు పోక్సో కోర్టు న్యాయమూర్తి అవధేశ్​ కుమార్​. మరో ఉపాధ్యాయుడు అభిషేక్​ కుమార్​కు జీవితకాల శిక్షతో పాటు రూ.50,000 జరిమానా వేశారు.

ఇదీ చూడండి: బిహార్​లో 'హాథ్రస్' తరహా ఘటన​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.