ETV Bharat / bharat

టీచర్ల చొరవ... విదేశీ భాషల్లో అలవోకగా మాట్లాడుతున్న విద్యార్థులు - మోర్షి మున్సిపల్ స్కూల్ మహారాష్ట్ర

మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మోర్షి మున్సిపల్ స్కూల్ విద్యార్థులు విదేశీ భాషల్లో అద్భుతంగా మాట్లాడుతున్నారు. సెల్​ఫోన్లతో సమయాన్ని వృథా చేసుకోకుండా.. వాటితోనే విదేశీ భాషలు నేర్చుకున్నారు. ఉపాధ్యాయులు మార్గదర్శకత్వంలో ఆంగ్లంతో పాటు జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, చైనీస్ వంటి భాషలను సులభంగా మాట్లాడుతున్నారు.

Morshi muncipal school Maharashtra
విదేశీ భాష మాట్లాడతున్న మహారాష్ట్ర పాఠశాల విద్యార్థులు
author img

By

Published : Dec 28, 2022, 11:07 PM IST

వారంతా ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. కరోనా కాలంలో అందరి మాదిరిగా.. బడులు మానేసి ఇళ్ల వద్దే ఉన్నారు. అయితే ఆ కాలాన్ని ఊరికే పోనివ్వలేదు. విదేశీ భాషలు నేర్చుకోవడానికి వాడుకున్నారు. సెల్​ఫోన్లను సమర్థంగా ఉపయోగించుకొని.. పలు భాషల్లో ప్రావీణ్యం సాధించారు. వారే.. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మోర్షి మున్సిపల్ స్కూల్ విద్యార్థులు.

ఈ ప్రాథమిక పాఠశాలలో మొత్తం 237 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఆంగ్లంతో పాటు జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, చైనీస్ భాషలను సులభంగా మాట్లాడుతున్నారు. విదేశీ భాషల పదాలు కఠినంగా ఉన్నా.. వాటిని అర్థం చేసుకోగలుగుతున్నారు. విద్యార్థుల ఈ పట్టుదల వెనుక ఆ పాఠశాల ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది. పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు.. యూట్యూబ్ వీడియోలు చూసి ఆంగ్లం​, ఇతర భాషలను ఎలా నేర్చుకోవాలో వారికి వివరించారు. గూగుల్ ట్రాన్స్​లేట్ సహాయంతో విదేశీ భాషా జ్ఞానాన్ని ఎలా పెంపోదించుకోవాలో వారికి తెలియజెప్పారు. దీంతో ఆ విద్యార్థులు మొబైల్ ఫోన్‌లను చక్కగా ఉపయోగించుకోగించుకుని కొత్త భాషలను నేర్చుకున్నారు.

Morshi muncipal school Maharashtra
పాఠశాల విద్యార్థులు

కరోనా కాలంలో బడులు మూతబడ్డ సమయంలో.. స్లమ్ ఏరియాల్లో ఉన్న విద్యార్థుల వద్దకు వెళ్లేవారు పాఠశాల ఉపాధ్యాయులు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కొత్త భాష ఎలా నేర్చుకోవాలో వివరించేవారు. విద్యార్థుల తల్లులకు సాంకేతికతను నేర్పించారు. ఆ ప్రాంతంలోని ఎనిమిది నుంచి పది మంది పిల్లలను ఒక బృందంగా ఏర్పాటు చేసి.. వారికి మార్గనిర్దేశం చేసే బాధ్యతను అక్కడి చదువుకున్న తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు చక్కగా ఉపయోగించుకున్నారు. దీంతో ఉపాధ్యాయుల కృషి ఫలించింది. వారి ప్రయత్నం సఫలమైంది. విద్యార్థులు కొత్త భాషలు తెలుసుకుని గలగలా మాట్లాడుతున్నారు.

Morshi muncipal school Maharashtra
పాఠశాల విద్యార్థులు

"ఈ పిల్లల కుబుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేదు. కరోనా సమయంలో వీరి చదువులు సరిగ్గా సాగలేదు. దీంతో పిల్లలకు ఇలా శిక్షణ ఇ్చచాం. మొదట ఇతర భాషల్లో.. వారి గురించి వారు చెప్పడం నేర్పించాం. తరువాత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల గురించి చెప్పడం ఎలాగో నేర్పించాం. దీంతో పిల్లల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి."
-సంజీవని భరదే, ఉపాధ్యాయురాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.