ETV Bharat / bharat

'హైకోర్టు న్యాయమూర్తులుగా వారిని పరిగణించండి'

సర్వోన్నత న్యాయస్థానంలోని న్యాయవాదులను హైకోర్టు జడ్జీలుగా నియమించే అంశాన్ని పరిగణించాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్​వీ రమణకు లేఖ రాశారు ఎస్​సీబీఏ అధ్యక్షుడు వికాశ్​ సింగ్​. ఎంత అనుభవం, సామర్థ్యం ఉన్నా.. సుప్రీంలోని న్యాయవాదులను పరిగణలోకి తీసుకోవడం లేదని పేర్కొన్నారు.

SCBA Prez writes to CJI urging elevation of lawyers practicing in SC as high court judges
హైకోర్టు న్యాయమూర్తుల కోసం వారిని పరిగణించండి
author img

By

Published : Jun 1, 2021, 8:13 PM IST

హైకోర్టుల జడ్జిలుగా సుప్రీంకోర్టులోని న్యాయవాదులను నియమించే అంశాన్ని పరిగణించాలని సుప్రీం బార్​ అసోసియేషన్​(ఎస్​సీబీఏ) అధ్యక్షుడు వికాశ్​ సింగ్​.. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్​వీ రమణకు లేఖ రాశారు. సర్వోన్నత న్యాయస్థానంలో పనిచేస్తున్న న్యాయవాదులకు అపార అనుభవం, వివిధ పరిస్థితులను ఎదుర్కోగలిగే సామర్థ్యం ఉందన్నారు.

"సుప్రీంలోని న్యాయవాదులకు చాలా అనుభవం ఉంది. కానీ హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం వారిని పరిగణించరు. హైకోర్టుల్లో ప్రాక్టీసు చేయకపోవడం ఇందుకు కారణం. ఎంత అనుభవం, జ్ఞానం ఉన్నా వారికి అవకాశం దక్కడం లేదు. ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. సరైన న్యాయవాదులను ఎస్​సీబీఏ ఎంపిక చేసి, సీజేఐకి పంపితే.. భారత ప్రధాన న్యాయమూర్తి ఆ జాబితాను వివిధ హైకోర్టు కోలీజియాలకు పంపే విధంగా వ్యవస్థ ఉండాలన్నది నా అభిమతం."

--- వికాశ్​ సింగ్​, ఎస్​సీబీఏ అధ్యక్షుడు.

హైకోర్టు జడ్జిలుగా నియమించేందుకు అనేకమంది మహిళా న్యాయవాదులు కూడా ఉన్నారని లేఖలో పేర్కొన్నారు వికాశ్​.

ప్రస్తుతం.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఉన్న కొలీజియం, ఆయా హైకోర్టుల్లో ప్రాక్టీసు చేస్తున్న న్యాయమూర్తులు, సర్వీస్​ కేటగిరీలోని జ్యుడీషియల్​ అధికారులను పరిగణలోకి తీసుకొని.. ఓ జాబితాను రూపొందిస్తోంది.

ఇదీ చూడండి:- సుప్రీంకోర్టు పనితీరుపై సీజేఐ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.