మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు జరిపించాలంటూ ముంబయి మాజీ సీపీ పరమ్‌వీర్ సింగ్ వేసిన పిటిషన్‌ను నేడు సుప్రీంకోర్టు విచారించనుంది.
తాను చేసిన ఆరోపణలను నిరూపించేందుకు దేశ్‌ముఖ్ ఇంటి సీసీటీవీ ఫుటేజీలను సేకరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. సాక్ష్యాలను నాశనం చేయకముందే మంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించేలా సీబీఐని ఆదేశించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి సభ్యులుగా గల ధర్మాసనం ఈ వ్యాజ్యం పరిశీలించనుంది.
'బదిలీ రద్దు చేయండి'
1988 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన పరమ్‌వీర్.. ముంబయి సీపీగా ఉన్న తనను హోం గార్డ్స్ విభాగానికి ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా బదిలీ చేశారని, దాన్ని రద్దు చేయాలని పిటిషన్లో కోరారు.
సోమవారం ఆయన హోం గార్డ్స్ చీఫ్ బాధ్యతలను స్వీకరించారు.
నెలకు రూ. 100 కోట్లు సంపాదించాలని పోలీసులకు.. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశాలు జారీ చేశారని ఇటీవల ఆరోపించారు పరమ్‌వీర్. దీనిపై సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాయడం పెద్ద దుమారం రేపింది.
ఇదీ చూడండి: 'మహా'లో లేఖ రచ్చ- ఠాక్రే సర్కార్‌పై ఒత్తిడి!