ETV Bharat / bharat

Gujarat riots 2002: మోదీకి క్లీన్​ చిట్​ను సమర్థించిన సుప్రీంకోర్టు - జాకియా జాఫ్రీ పిటిషన్

PM MODI GUJARAT RIOTS: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ సహా 64 మందికి సిట్ క్లీన్​ చిట్​ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. జాకియా జాఫ్రీ దాఖలుచేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

pm modi gujarat riots
నరేంద్ర మోదీ
author img

By

Published : Jun 24, 2022, 12:05 PM IST

Updated : Jun 24, 2022, 12:49 PM IST

PM MODI GUJARAT RIOTS: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 64 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు స్పెషల్ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్ ఆదేశాలను జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది.

గుజరాత్ హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. గుజరాత్ అల్లర్ల వేళ 2002 ఫిబ్రవరి 28 న అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్‌ సొసైటీలో ప్రాణాలు కోల్పోయిన 68 మందిలో మాజీ ఎంపీ ఎహ్సాన్‌ జాఫ్రీ ఉన్నారు. ఈ కేసులో 64 మందికి క్లీన్‌చిట్‌ రాగా దాన్ని సవాల్ చేస్తూ ఎహ్సాన్‌ జాఫ్రీ భార్య.. జాకియా జాఫ్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జాకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

2021 డిసెంబర్ 9న ఈ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. తాజాగా శుక్రవారం నాడు తీర్పును వెలువరించింది. సిట్​ నిర్ణయాన్ని సమర్థిస్తూ గుజరాత్ హైకోర్టు 2017లోనే ఈ కేసును కొట్టివేసింది. గుజరాత్​ హైకోర్టు ఆదేశాలను సైతం సుప్రీం సమర్థించింది.

ఇవీ చదవండి: 'మహారాష్ట్రలో శివసేన లేకుండా చేయాలని ఎన్సీపీ, కాంగ్రెస్ కుట్ర'

అనుమానాస్పదంగా జింకల కళేబరాలు.. సోలార్​ కంపెనీ పనేనా?

Last Updated : Jun 24, 2022, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.