ETV Bharat / bharat

Oxygen Concentrator: హైకోర్టు తీర్పును నిలిపేసిన సుప్రీం - పన్ను రద్దుపై సుప్రీం స్టే

ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లపై(Oxygen Concentrator) పన్ను రద్దు వ్యవహారంలో దిల్లీ హైకోర్టు ఆదేశాలను నిలిపివేసింది సుప్రీం కోర్టు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పన్ను విధించడం అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.

supreme court
సుప్రీం కోర్టు
author img

By

Published : Jun 2, 2021, 6:44 AM IST

వ్యక్తిగత వినియోగం నిమిత్తం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లపై(Oxygen Concentrator) సమీకృత వస్తుసేవల పన్ను (ఐజీఎస్టీ) విధించడం రాజ్యాంగ విరుద్ధమంటూ.. దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకూ ఇది అమలులో ఉంటుందని తెలిపింది. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాల ప్రత్యేక ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.

కొవిడ్‌ బాధితుడైన ఓ వ్యక్తి- "నా దయనీయ పరిస్థితి చూసి విదేశంలో ఉన్న మేనల్లుడు వ్యక్తిగత వినియోగం నిమిత్తం ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ను(Oxygen Concentrator) బహుమతిగా పంపాడు. కానీ, ప్రభుత్వం దానిపై 12% ఐచ్కీజీజిఎస్టీ విధించింది! ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత నెలకొన్న తరుణంలో కొవిడ్‌ బాధితులు బతకడానికి ఇది ఎంతో అత్యవసరం. దీనిపై పన్ను వేయడమంటే జీవించే ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమే" అంటూ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గత నెల 21న తీర్పు వెలువరించింది. సొంతంగా వాడుకోవడానికి దిగుమతి చేసుకునే ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లపై పన్ను విధించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. దీన్ని కేంద్ర ఆర్థికశాఖ రెవెన్యూ విభాగం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

విచారణ సందర్భంగా అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ వాదనలు వినిపిస్తూ.. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లపై(Oxygen Concentrator) ఇంతకుముందు 77% ఐజీఎస్టీ ఉండేదని, కేంద్రం దాన్ని 12 శాతానికి తగ్గించిందన్నారు. అయినా, దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రాజ్యంగ విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించడాన్ని ఆక్షేపించారు. కొవిడ్‌ అత్యవసరాలపై పన్ను మినహాయింపునకు సంబంధించి మంత్రుల బృందం ఈ నెల 8న నివేదిక ఇవ్వనుందని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో హైకోర్టు తీర్పును ధర్మాసనం తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై స్పందించాలని పిటిషనర్‌ను ఆదేశించింది.

ఇదీ చదవండి:Covid: స్వరూపం మారితేనే.. పిల్లలపై ప్రభావం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.