ETV Bharat / bharat

'విరాట్‌ నౌకను తుక్కు చేయొచ్చు' - సుప్రీంకోర్టు తీర్పులు

భారత నౌకాదళంలో మూడు దశాబ్దాల పాటు సేవలందించిన విమాన వాహన నౌక ఐఎన్​ఎస్​ 'విరాట్'ను తుక్కుగా మార్చే ప్రక్రియను నిలిపేయాలంటూ దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే నౌక విచ్ఛిన్నం 40శాతం పూర్తైనందున ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

supreme court
సుప్రీంకోర్టు
author img

By

Published : Apr 12, 2021, 5:31 PM IST

మూడు దశాబ్దాల పాటు భారత నౌకాదళంలో సేవలందించిన విమాన వాహన నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను తుక్కు చేసే ప్రక్రియను కొనసాగించొచ్చని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ నౌక విచ్ఛిన్న ప్రక్రియను ఆపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్‌ చాలా ఆలస్యంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే నౌకలోని 40శాతాన్ని నిర్వీర్యం చేసినందున, ఇప్పుడు విచ్ఛిన్న ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

40శాతం విచ్ఛిన్నం..

29ఏళ్ల పాటు భారత నౌకాదళంలో సేవలందించిన ఐఎన్‌ఎస్‌ విరాట్‌ జీవనకాలం పూర్తవగా.. 2017 మార్చిలో నేవీ దీన్ని పక్కనబెట్టింది. తొలుత దీన్ని మ్యూజియంగా మార్చాలని యత్నించారు. ఆ ప్రణాళికలు ఫలించకపోగా.. దీన్ని తుక్కుగా మార్చి విక్రయించాలని కేంద్రం నిర్ణయించి శ్రీరాం షిప్‌ బ్రేకర్స్‌ అనే సంస్థకు అమ్మేసింది. ఈ నౌకను గుజరాత్‌లోని అలంగ్‌ తీరానికి తీసుకొచ్చి ఇప్పటికే నౌకలోని 40శాతం నిర్వీర్యం చేశారు. దీనిని మ్యూజియంగా మార్చాలని భావిస్తున్న ఎన్విటెక్‌ అనే మరో సంస్థ నౌకను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. కానీ, రక్షణశాఖ నుంచి నిరభ్యంతర పత్రం రాకపోవడం వల్ల సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఇవీ చదవండి: 'రూ.100 కోట్లకు ఐఎన్​ఎస్​ విరాట్ అమ్మకం'

ఐఎన్​ఎస్​ విరాట్​ విచ్ఛిన్నంపై వివాదం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.