ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని వర్గానికి శివసేన పేరు, పార్టీ గుర్తును కేటాయించాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌పై ఉద్ధవ్ ఠాక్రే వర్గం దాఖలు చేసిన వ్యాజ్యంపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈసీ నిర్ణయానికి ముందున్న యథాతథ స్థితిని కొనసాగించాలని ఉద్ధవ్ ఠాక్రే తరపున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ ధర్మసనాన్ని కోరారు. ఎన్నికల సంఘం ఆదేశాలపై స్టే ఇవ్వడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. ఈ దశలో ఆర్డర్‌పై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఠాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏక్‌నాథ్ శిందే వర్గానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఠాక్రే వర్గానికి చెందిన చట్టసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించేందుకు ఎలాంటి విప్ జారీ చేయబోమని, ఏ చర్యలు ప్రారంభించబోమని శిందే వర్గం తరపు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. అనంతరం విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
శివసేన కేసులో ఈసీ ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నో - SC on Shinde faction as real Shiv Sena
ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని వర్గానికి శివసేన పేరు, పార్టీ గుర్తును కేటాయించాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది.