Offline board exams supreme court: ఈ ఏడాది సీబీఎస్ఈ సహా ఇతర బోర్డులు ఆఫ్‌లైన్‌లో నిర్వహించే 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆఫ్‌లైన్‌కు బదులుగా ప్రత్యామ్నాయ మార్గంలో పరీక్షలు నిర్వహించేలా సీబీఎస్ఈ, ఇతర బోర్డులను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. అయితే.. అలాంటి పిటిషన్లు తప్పుడు భావన, గందరగోళాన్ని సృష్టిస్తాయని పేర్కొంది జస్టిస్ ఎంఏ ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం.
"ఇది పరీక్షలకు సిద్ధమవుతోన్న విద్యార్థుల్లో తప్పుడు ఆశలను కలిగించటమే కాకుండా గందరగోళాన్ని సృష్టిస్తుంది. విద్యార్థులను, అధికారులను వారి విధులు వారు నిర్వర్తించనివ్వాలి."
- సుప్రీం ధర్మాసనం.
ఏప్రిల్ 26 నుంచి 10, 12వ తరగతుల టెర్మ్-2 బోర్డు పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది.
ఇదీ చూడండి: బాలికపై ట్యూటర్ అత్యాచారం.. ఆపై హత్య.. ఆమె దుస్తులతో..