ETV Bharat / bharat

నల్లకుబేరులకు జీవితఖైదుపై వ్యాజ్యం కొట్టివేత - block money

నల్లధనం జప్తు చేయడం, లంచం వంటి కేసుల్లో జీవితఖైదు విధింపు సాధ్యాసాధ్యాలను పరిశీలించేలా కేంద్రాన్ని ఆదేశించాలన్న పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే.. పిటిషన్​దారును న్యాయ కమిషన్​ను సంప్రదించవచ్చని తెలిపింది.

sc-refuses-to-entertain-a-plea-on-black-money-matter
నల్లధనం కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
author img

By

Published : Dec 11, 2020, 4:36 PM IST

నల్లధనం, బినామీ వంటి కేసుల్లో దోషులకు జీవిత ఖైదు విధించాలన్న పిటిషన్​ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. 100 శాతం నల్లధనాన్ని జప్తు చేయడం సహా, లంచం, బినామీ వంటి కేసుల్లో దోషులకు జీవిత ఖైదు విధించేలా కేంద్రం చట్టాలు తేవాలని కోరుతూ భాజపా నేత, అశ్వినీ కుమార్​ ఉపాధ్యాయ్​ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే.. శాసన, కార్యనిర్వాహక అంశాల్లో తాము జోక్యం చేసుకోలేమని, చట్టాలు చేయమని పార్లమెంటుకు ఆదేశాలు జారీ చేయలేమని కోర్టు స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా.. జస్టిస్​ సంజయ్​ కౌల్​, జస్టిస్​ దినేష్​ మహేశ్వరి, జస్టిస్​ హృషికేశ్​ సభ్యులుగా గల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

'' మీకు రెండు విషయాలు చెప్తాను. శాసన, కార్యనిర్వాహక అని రెండు విభాగాలు ఉంటాయి. వాటిని పరిశీలించేందుకు న్యాయ వ్యవస్థ ఉంటుంది. దేని పని, పరిధి దానిదే. అంతేగానీ.. మూడింటి బాధ్యతలు చేపట్టాలని మీరు న్యాయ విభాగాన్ని అడగలేరు. రాజ్యాంగం కూడా అలా చెప్పదు.

కొంతమంది కోర్టుకు వస్తారు. దేశాన్ని శుభ్రం చేయాలంటారు. ఇందులో ఏమైనా అర్థం ఉంటుందా? ఈ పిటిషన్లు పరిశీలించేవేనా? పేదరికాన్ని నిర్మూలించమనడం, అవినీతి రహిత దేశాన్ని చేయమనడం.. ఇవన్నీ పిటిషన్లేనా?''

- జస్టిస్​ సంజయ్​ కౌల్​, సుప్రీంకోర్టు న్యాయమూర్తి

వ్యాజ్యాలు దాఖలు చేసే బదులు.. పుస్తకాలు రాయాలని పిటిషన్​దారుకు సూచించారు జస్టిస్​ కౌల్​. మరో న్యాయమూర్తి జస్టిస్​ మహేశ్వరి.. ఉపాధ్యాయ పిటిషన్​ను ప్రచార ప్రయోజన వ్యాజ్యంగా అభివర్ణించారు. పిటిషన్​దారు కొంత మంచి పని చేసినా.. ఈ వ్యాజ్యాన్ని ప్రోత్సహించలేమని పేర్కొన్నారు.

చివరగా పిటిషన్​ను తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం.. సంబంధిత అంశంపై లా కమిషన్​ను సంప్రదించవచ్చని స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.