ETV Bharat / bharat

'మహిళా న్యాయమూర్తుల కొరత ఆందోళనకరం' - సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ డీవై చంద్రచుద్

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో కేవలం ఒక మహిళా జడ్జి ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. న్యాయవృత్తిలో మహిళల ఎదగుదలకు అనుకూల వాతావరణం కల్పించాలన్నారు.

sc
'మహిళ న్యాయమూర్తుల కొరత ఆందోళకరం'
author img

By

Published : Mar 14, 2021, 8:24 AM IST

సుప్రీంకోర్టులో ఒకే మహిళా న్యాయమూర్తి ఉండటం ఆందోళనకరమని జస్టిస్ డీవై చంద్రచూడ్​ అన్నారు. ఈ పరిస్థితిపై సమీక్షించుకోవాలని పేర్కొన్నారు. దిల్లీలో శనివారం నిర్వహించిన జస్టిస్ ఇందు మల్హోత్రా పదవీ విరమణ కార్యక్రమం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

"జస్టిస్​ ఇందు మల్హోత్రా పదవీ విరమణతో సుప్రీంకోర్టులో ఇప్పుడు ఒక్క మహిళా న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు. ఇది ఆందోళన చెందాల్సిన విషయం. ఈ పరిస్థితిని సమీక్షించి, చర్యలు చేపట్టాలి. ప్రజలను ప్రభావితం చేసే ఈ న్యాయవ్యవస్థను మెరుగ్గా ఉంచేందుకు మనం కృషి చేయాలి. దీని వల్ల ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుంది. న్యాయవృత్తిలో మహిళల ఎదుగుదలకు వీలు ఉండే వాతావరణాన్ని కల్పించాలి."

-జస్టిస్ డీవై చంద్రచూడ్​, సుప్రీంకోర్టు న్యాయమూర్తి

న్యాయవాది​ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి మహిళా లాయర్​గా ఇందు మల్హోత్రా గుర్తింపు పొందారు. 2018 ఏప్రిల్​ 27న బాధ్యతలు చేపట్టిన మల్హోత్రా ఎన్నో కీలక తీర్పులు వెల్లడించారు.

ఇదీ చదవండి : గంగా హారతిలో కుటుంబ సమేతంగా రాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.