ETV Bharat / bharat

జస్టిస్​ ఎంఆర్​ షాకు తీవ్ర అస్వస్థత- స్పెషల్ ఫ్లైట్​లో దిల్లీకి... - సుప్రీం న్యాయమూర్తి

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎంఆర్​ షా తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం హిమాచల్​ ప్రదేశ్​ నుంచి దిల్లీకి వాయుమార్గం ద్వారా తరలించారు.

SC-JUDGE
సుప్రీం జడ్జీ జస్టిస్​ ఎంఆర్​ షా
author img

By

Published : Jun 16, 2022, 4:18 PM IST

Updated : Jun 16, 2022, 10:39 PM IST

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎంఆర్​ షా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హిమాచల్​ప్రదేశ్​ నుంచి వాయు మార్గం ద్వారా దిల్లీకి తరలించారు. ఛాతిలో నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. వైద్యం కోసం జస్టిస్​ షాను దిల్లీకి తరలించే విషయంపై సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నట్లు తెలిసింది.
అయితే.. తన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని జస్టిస్​ షా స్పష్టం చేశారు.

"నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. రెండ్రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా తిరిగొస్తా. "

- జస్టిస్​ ఎంఆర్​ షా.

ఆసుపత్రికి సీజేఐ: సుప్రీం న్యాయమూర్తి జస్టిస్​ ఎంఆర్​ షా చికిత్స పొందుతున్న దిల్లీలోని ఎస్కార్ట్స్​ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ. ఆయన ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు.

ఇదీ చూడండి: భారత్​లో మరోసారి పోలియో కలకలం.. అధికారులు హైఅలర్ట్​!

Last Updated : Jun 16, 2022, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.