సుప్రీం కోర్టులో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. టూల్ కిట్ కేసులో(toolkit case india) భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రాపై దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను విచారించేందుకు నిరాకరించింది కోర్టు(toolkit case judgement).
ఇరువురు నేతలపై టూల్‌కిట్‌కు(toolkit case) సంబంధించి నమోదైన కేసుల విచారణపై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది(toolkit news today). ఈ పిటిషన్లు పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
" ఈ కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టును నిర్ణయం తీసుకోనివ్వండి. వివిధ హైకోర్టుల్లో టూల్‌కిట్‌కు సంబంధించిన చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నందున ఈ కేసులను ప్రత్యేకంగా చూడలేం. మీ శక్తిని ఇక్కడ వృథా చేసుకోవద్దు. స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారించాలనుకోవట్లేదు. వాటిని తిరస్కరిస్తున్నాం. "
- సుప్రీం ధర్మాసనం.
ఫేక్ టూల్ కిట్‌కు సంబంధించిన కేసుల విచారణను వేగవంతం చేయాలని ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు సూచించింది ధర్మాసనం.
ఈ ఏడాది మే 19, ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు ఆకాశ్ శర్మ ఫిర్యాదుతో.. రమణ్ సింగ్, సంబిత్ పాత్రాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో విచారణ నుంచి తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ జూన్ 11న ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
ఆలయ ట్రస్ట్ వ్యాజ్యం తిరస్కరణ
మరోవైపు... 25 ఏళ్లుగా జరిగిన లావాదేవీలపై ఆడిట్ నిర్వహించాలని గత ఏడాది ఇచ్చిన ఆదేశాల నుంచి మినహాయింపు ఇవ్వాలని కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది సుప్రీం కోర్టు. మూడు నెలల్లోపు ఆడిట్ పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేసింది జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం.
ఇదీ చూడండి: 'టూల్‌కిట్' కేసులో ఇద్దరికి నాన్ బెయిలబుల్ వారెంట్