భారత సైన్యంలో మరో 39 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదా(Permanent Commission For Women) దక్కనుంది. ఈ హోదా కోసం వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ అధికారిణులకు విజయం లభించింది. వారం పని దినాల్లోగా శాశ్వత కమిషన్ హోదా(Permanent Commission For Women) కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
సైన్యంలో 14ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదా ఇవ్వాలని సుప్రీంకోర్టు 2020 ఫిబ్రవరి 17న తీర్పు వెలువరించింది. ఫలితంగా సైన్యం ఓ కమిటీని ఏర్పాటు చేసి 400 మందికి పైగా మహిళా అధికారులకు ఈ హోదా(Permanent Commission For Women) కల్పించింది. మహిళా అధికారుల వార్షిక రహస్య నివేదిక సమీక్ష ఆధారంగా.. కొందరికే ఈ హోదా నిరాకరించింది. శాశ్వత కమిషన్ తిరస్కరణకు గురైన 71 మంది అధికారిణులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శాశ్వత కమిషన్‌లో చేర్చే విధానం ఏకపక్షం, అన్యాయంగా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టు విచారణ జరపగా.. ఈ 71 మందిలో 39 మంది మహిళా అధికారులు మాత్రమే శాశ్వత కమిషన్‌కు అర్హులుగా గుర్తించినట్లు.. కేంద్రం తెలిపింది. మరో ఏడుగురు వైద్యపరంగా ఫిట్‌గా లేరని, 25 మందిపై క్రమశిక్షణారాహిత్య అభియోగాలున్నాయని పేర్కొంది. కేంద్రం నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు ఆ 39 మందికి వారం పని దినాల్లో.. శాశ్వత కమిషన్ హోదా కల్పించాలని ఆదేశించింది. మిగతా 25 మంది శాశ్వత కమిషన్‌ను ఎందుకు అనర్హులో కూడా తెలియజేయాలని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: మహిళా కమిషన్‌పై వ్యాజ్యాలను స్వీకరించిన సుప్రీం
ఇదీ చూడండి: 'ఎన్‌డీఏలో మహిళల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్'