భిక్షమెత్తుకోవడాన్ని నేరంగా పరిగణించే చట్టాలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై మూడు వారాల్లోగా తమ సమాధానం చెప్పాలని కేంద్రానికి, మహారాష్ట్ర, హరియాణా, బిహార్, పంజాబ్ రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆగస్టు 2018లో భిక్షమెత్తుకోవడం నేరం కాదని దిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. బాంబే ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ 1959.. రాజ్యాంగం ప్రకారం చెల్లదని చెప్పింది.
ఈ నేపథ్యంలో ఆ చట్టంలోని కొన్ని నిబంధనలు తప్ప అన్నింటినీ చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని మేరట్ నివాసి విశాల్ పాఠక్ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. "భిక్షాటన చేసేవాళ్లు సమాజంలో ఉన్నారంటే ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కూడా తమ పౌరులకు కల్పించడంలో విఫలమైందని అర్థం. తన తప్పులను సమీక్షించుకోకుండా.. అడుక్కోవడం నేరమనడం సహేతుకం కాదు" అని పిటిషన్‌లో విశాల్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి : మత్తుమందు ఇచ్చి ప్రముఖ మోడల్‌పై అత్యాచారం