ETV Bharat / bharat

చట్టసభ్యుల కేసుల విచారణపై సుప్రీం కీలక ఆదేశాలు

చట్టసభ్యులపై చిన్న నేరాలకు సంబంధించిన కేసులు విచారించేందుకు ప్రత్యేక మేజిస్టీరియల్​ కోర్టులు(Sc on special magesterial courts) ఏర్పాటుపై నోటిఫికేషన్ విడుదల చేయాలని అలహాబాద్​ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. నేర తీవ్రతను బట్టి.. ఈ కేసులను సెషన్స్​ కోర్టుకు, లేదా మేజిస్టీరియల్​ కోర్టుకు కేటాయించాలని సూచించింది.

lawmakers in minor offences, sc on specail courts in up
ప్రత్యేక కోర్టులపై సుప్రీంకోర్టు
author img

By

Published : Nov 25, 2021, 6:19 PM IST

ప్రజా ప్రతినిధులపై చిన్న నేరాలకు సంబంధించిన కేసుల(Minor offences on lawmakers) విచారణ కోసం ప్రత్యేక మేజిస్టీరియల్​ కోర్టులు(Sc on special magesterial courts) ఏర్పాటు చేసేందుకుగాను నోటిఫికేషన్ విడుదల చేయాలని అలహాబాద్​ హైకోర్టును(allahabad high court special judicial magistrate) సుప్రీంకోర్టు ఆదేశించింది. నేర తీవ్రత ఆధారంగా.. ఈ కేసులను సెషన్స్​ లేదా మేజిస్టీరియల్ కోర్టుకు కేటాయించాలని చెప్పింది. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ తరహా కోర్టులు ఏర్పాటు చేయకపోవడం చూస్తే.. తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలుస్తోందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

చట్టసభ్యులపై నమోదైన చిన్న నేరాలకు సంబంధించి.. మేజిస్టీరియల్ కోర్టులు విచారించే ఈ కేసులను సెషన్స్​ కోర్టు జడ్జి అధ్యక్షతన ప్రత్యేక కోర్టులో విచారణ జరపవచ్చా? అని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులను సెషన్స్​ జడ్జి విచారణ జరిపితే.. మేజిస్ట్రేట్​ జడ్జి కంటే సెషన్స్ జడ్జి సీనియర్ అయినందున నిందితులు అప్పీళ్లు చేసుకునే ఆస్కారం లేకుండా పోతుందని పిటిషన్​దారు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. మేజిస్టీరియల్ కోర్టు విచారణ చేపట్టిన తర్వాత సెషన్స్​ కోర్టుకు బదిలీ అయిన ఈ కేసులను తిరిగి మేజిస్టీరియల్​ కోర్టుకు బదిలీ చేయాలని హైకోర్టును ఆదేశించింది. విచారణను మేజిస్టీరియల్​ కోర్టు ఎక్కడైతే విరమించిందో.. అక్కడి నుంచే మళ్లీ మొదలుపెట్టాలని చెప్పింది. 2019 ఆగస్టు 16న తాము ఇచ్చిన తీర్పును తప్పుగా అర్థం చేసుకున్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించింది.

తనపై నమోదైన కేసులను మేజిస్ట్రేట్ కోర్టు కాకుండా సెషన్స్​ కోర్టు విచారణ జరుపుతోందని సమాజ్​వాదీ పార్టీ నేత ఆజం ఖాన్​ కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. మేజిస్ట్రేట్​ విచారించే కేసులను సెషన్స్​ కోర్టు విచారించవచ్చని సుప్రీంకోర్టు చెప్పలేదని పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ మేరకు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్ సూర్యకాంత్ సభ్యులుగా ఉన్నారు.

ఇదీ చూడండి: 'చట్ట ప్రకారమే ప్రత్యేక కోర్టుల పరిధి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.