ETV Bharat / bharat

'ఎన్​డీఏ' పరీక్షకు ఈ ఏడాది నుంచే మహిళలకు అనుమతి - ఎన్​డీఏ పరీక్షలు సుప్రీంకోర్టు

జాతీయ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్షకు (NDA Exam 2021) మహిళలను ఈ ఏడాదే అనుమతించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. (NDA Exam Women) నవంబర్​లో జరిగే పరీక్షకు వారికి అవకాశం కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

NDA WOMEN
'ఎన్​డీఏ' పరీక్షకు ఈ ఏడాది నుంచే మహిళలకు అనుమతి
author img

By

Published : Sep 22, 2021, 5:36 PM IST

Updated : Sep 22, 2021, 6:00 PM IST

నవంబర్​లో జరిగే జాతీయ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్షకు (NDA Exam november 2021) మహిళలకు అవకాశం కల్పించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వచ్చే ఏడాది నుంచి మహిళలను అనుమతిస్తామని కేంద్రం చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చింది. (NDA Exam Women) మహిళలకు అవకాశం కల్పించేందుకు 2022 వరకు వేచి చూడలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళల హక్కులను కాలరాయలేమని స్పష్టం చేసింది.

కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి.. డిఫెన్స్ సర్వీసెస్ (Defence Services) ఏర్పాటు చేసిన స్టడీ గ్రూప్.. పరీక్షను వాయిదా (NDA exam postponed 2021) వేయాలని సూచించిందని తెలిపారు. మౌలిక సదుపాయాలు, ఫిట్​నెస్ ట్రైనింగ్, పాఠ్యాంశాలు తదితర అంశాలను ఈ స్టడీ గ్రూప్ పరిశీలిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో.. మహిళలకు వచ్చే ఏడాది నుంచి అవకాశం కల్పిస్తామని తెలిపారు. 2022 మే నెలలో ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అందుకు అనుమతించాలని కోరారు. అయితే, ఈ విన్నపాన్ని ధర్మాసనం తిరస్కరించింది.

"మీ సమస్యలన్నింటినీ గుర్తిస్తున్నాం. కానీ దీనికి పరిష్కారాలను వెతికే సామర్థ్యం మీకు ఉందని మా నమ్మకం. ఫిట్​నెస్ టెస్టులు వంటివి ప్రతిపాదిస్తున్నారు. వివిధ అంశాలపై మీరు చేస్తున్న ప్రయత్నాలు స్వాగతించదగినవి. కానీ, పరీక్షను మరో ఏడాది పాటు వాయిదా వేయడమే మాకు కష్టంగా కనిపిస్తోంది. నవంబర్​లో పరీక్షకు అనుమతిస్తామని ఆశ కల్పించి.. ఇప్పుడేమో భవిష్యత్​లో అవకాశం వస్తుందని మేం ఆ ఆశను తుంచేయాలని అనుకోవట్లేదు."

-సుప్రీంకోర్టు

అయితే, పరీక్ష ఏడాది పాటు వాయిదా పడదని భాటి తెలిపారు. ఎన్​డీఏలో ప్రతి కోర్సుకు (NDA Course Syllabus) తగిన ప్రమాణాలను నెలకొల్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే, ఈ సమస్యలు పెద్దగా కఠితరమైనవి కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పరీక్షలపై జులైలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. చివరకు కేంద్రం ఆరు నెలలు సమయం కోరగా.. దానికీ బెంచ్ నిరాకరించింది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 22, 2021, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.