SBI PO Notification 2022 : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1673 ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ) నియామకాలకు సెప్టెంబర్ 22 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు https://sbi.co.in/ ద్వారా అప్లై చేసుకోవాలని ఎస్బీఐ సూచించింది. ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా నియామాకాలు చేపట్టనుంది. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 12 చివరి తేదీగా నిర్ణయించింది.
- పోస్టు: ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ)
- అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
- వయసు: 2022 ఏప్రిల్ 1 నాటికి 21-30 ఏళ్లు ఉండాలి.
- ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 12
- అడ్మిట్ కార్డుల డౌన్లోడ్: డిసెంబర్ మొదటి/ రెండో వారం
- ప్రిలీమ్స్ పరీక్ష: డిసెంబర్ 17-20
- ఫలితాలు: 2022 డిసెంబర్/ 2023 జనవరి
- వెబ్సైట్: https://sbi.co.in/
దరఖాస్తు చేయండిలా..: ఎస్బీఐ అధికారిక వెబ్సైట్.. sbi.co.in ఓపెన్ చేసి.. కెరియర్ లింక్‌పై క్లిక్ చేయాలి. తర్వాత కరెంట్ ఓపెనింగ్స్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఎస్బీఐ పీఓ లింక్‌పై క్లిక్ చేయాలి. అక్కడ లాగ్ఇన్ వివరాలు లేదా రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేయాలి. అనంతరం దరఖాస్తు నింపి.. సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయాలి. తర్వాత పరీక్ష ఫీజు చెల్లించి.. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత ధ్రువీకరణ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి.