ETV Bharat / bharat

SBI Jobs : ఎస్​బీఐలో 107 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​.. అప్లై చేసుకోండిలా!

SBI Jobs 2023 : బ్యాంక్​ ఉద్యోగం చేయాలని కలలు కనేవారికి గుడ్​న్యూస్​. ఎస్​బీఐ మొత్తం 107 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్​ విడుదల అయింది. మరి అవి ఏం పోస్టులు, ఎవరు అర్హులు, అప్లికేషన్​ ఫీజు ఎంత, దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు తదితర వివరాలు మీ కోసం.

SBI Recruitment 2023
SBI Control Room Operator And Armorers Jobs
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2023, 2:36 PM IST

SBI Jobs 2023 : ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగిగా స్థిరపడాలని కలలు కనేవారికి శుభవార్త. స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా 107 పోస్టుల భర్తీ చేసేందుకు ప్రకటనను విడుదల చేసింది. అసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ రోజు (సెప్టెంబర్​ 6) నుంచే ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ( SBI Recruitment 2023 )

మొత్తం ఖాళీలు!
SBI Vacancy 2023 : 107 పోస్టులు

ఈ పోస్టులు!

  • కంట్రోల్​ రూమ్​ ఆపరేటర్​ పోస్టులు (క్లరికల్ కేడర్​) - 89
  • ఆర్మరర్స్​​ పోస్టులు - 18

ఏజ్​ లిమిట్​!
SBI Jobs 2023 Age Limit :

  • ఆర్మరర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు కనిష్ఠంగా 20 ఏళ్లు, గరిష్ఠంగా 45 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • కంట్రోల్​ రూమ్​ ఆపరేటర్​ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే ఆశావాహుల వయస్సు కనిష్ఠంగా 20 ఏళ్లు, గరిష్ఠంగా 48 ఏళ్లు ఉండాలి.
  • స్టేట్​ ఫైర్​ విభాగంలో పని చేసిన ఎక్స్​-సర్వీస్​మెన్​ అభ్యర్థుల వయస్సు గరిష్ఠంగా 35 ఏళ్లు లోపు ఉండాలి.

వీరు మాత్రమే అర్హులు!
SBI Jobs 2023 Qualification :

  • ఆర్మరర్స్(ఎక్స్​-సర్వీస్​మెన్​)​కి చెందిన కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అంటే మిలిటరీ లేదా పోలీస్​ ఫోర్స్​లోని ఆర్మరర్స్​ విభాగంలో పని చేసి రిటైర్​ అయిన ఉద్యోగుల పిల్లలు మాత్రమే అప్లై చేసుకోవాలి.
  • ఇక కంట్రోల్​ రూమ్​ ఆపరేటర్​ పోస్టుల కోసం రాష్ట్ర అగ్నిమాపక శాఖలో సేవలు అందించి రిటైర్​ అయిన ఎక్స్​-సర్వీస్​మెన్,​ అలాగే ఆర్మరర్స్​​ కుటుంబానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.

అప్లికేషన్​ ఫీజు!
SBI Armorer Jobs Application Fees : పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్​ ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.

పరీక్షా తేదీ!
SBI Jobs 2023 Exam Dates : ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబరులో ఆన్​లైన్​ విధానంలో పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది.

ఇన్ని మార్కులకు!
SBI Jobs 2023 Exam Marks : 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 25 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది.

దరఖాస్తు చివరితేదీ!
SBI Jobs 2023 Apply Last Date : అర్హత గల అభ్యర్థులు 2023 అక్టోబర్​ 10 లోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం!
SBI Jobs 2023 Selection Process : ఆన్​లైన్​ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అధికారిక వెబ్​సైట్​!
SBI Official Website : నోటిఫికేషన్​కు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఎస్​బీఐ అధికారిక వెబ్​సైట్​ sbi.co.inను వీక్షించవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.