ఉద్యోగ అవకాశాల కోసం నిరీక్షిస్తున్న వారికి శుభవార్త. దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఐబీపీఎస్ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సెనల్ సెలక్షన్). మొత్తం 5,830 పోస్టులకు ఈ ఏడాది పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తు రుసుము రూ.850 కాగా.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రూ.175.
ముఖ్యమైన తేదీలు..
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ: జులై 12
- దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 1
- దరఖాస్తులు ఎడిట్ చేసుకోవడానికి చివరి తేదీ: ఆగస్టు 1
- ప్రాథమిక పరీక్ష: ఆగస్టు 28-29, సెప్టెంబర్ 4
- ఫలితాలు: 2021 సెప్టెంబర్
- మెయిన్స్ పరీక్షలు: 2021 అక్టోబర్ 31
- ఫలితాలు: 2022 ఏప్రిల్ 1
- దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్: ibps.in
అర్హత..
2021 జులై 21 నాటికి 20ఏళ్ల నుంచి 28ఏళ్లలోపు ఉండేవారు ఈ పరీక్షకు అర్హులు. అంటే.. 1993 జులై 2 నుంచి 2001 జులై 1 మధ్య జన్మించినవారే అర్హులు. ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పాస్ అవ్వాలి.
ఇతర వివరాలు..
బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల్లో క్లర్క్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఐబీపీఎస్.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీ ప్రక్రియ రాష్ట్రాలు- కేంద్ర పాలిత ప్రాంతాల ఆధారంగా ఉంటుంది. అందువల్ల దరఖాస్తు చేసుకునే వారు కేవలం ఒకటే రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న చోటే ఆన్లైన్ పరీక్ష ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మైనారిటీలకు.. పరీక్షల కోసం శిక్షణా తరగతులను సైతం ఏర్పాటు చేశారు. ఆగస్టు 16న శిక్షణ ప్రారంభమవుతుంది.
దరఖాస్తు చేసుకోవడం ఎలా?
- ibps.in వెబ్సైట్లోకి వెళ్లాలి
- ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ నోటిఫికేషన్‌ను క్లిక్ చేయాలి
- న్యూ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి
- సాధారణ వివరాలు నమోదు చేసుకుని ఐడీ, పాస్వర్డ్ పొందాలి
- ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి
- అప్లికేషన్ ఫామ్‌ను నింపాలి
- సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయాలి
- అప్లికేషన్ రుసుమును చెల్లించి, ఆ రసీదు డౌన్లోడ్ చేసుకోవాలి
- అప్లికేషన్ ఫామ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
ఇవీ చదవండి: