ETV Bharat / bharat

కొత్త వివాదంలో ఆప్ మంత్రి.. మరో వీడియో లీక్.. అందులో ఏముందంటే? - సత్యేందర్ జైన్ లీకయిన మరో వీడియో న్యూస్

తిహాడ్ జైలులో ఉన్న ఆప్ మంత్రి మసాజ్, ఫుడ్ వీడియోలు ఇటీవల లీకవడం వల్ల ఆప్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే ఇప్పుడు మరో వీడియో లీకైంది.

satyendar-jain-another-video-viral-with-jail-superintendent
జైలు సూపరిండెంట్​తో చర్చలు జరుపుతున్న సత్యేందర్ జైన్
author img

By

Published : Nov 26, 2022, 1:22 PM IST

Updated : Nov 26, 2022, 3:12 PM IST

జైలు సూపరిండెంట్​తో చర్చలు జరుపుతున్న సత్యేందర్ జైన్

తిహాడ్‌ జైలులో ఉన్న దిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌కు సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది. ఇప్పటికే సత్యేందర్‌ జైన్‌ మసాజ్‌ చేయించుకుంటున్నట్లు, ఆహారం తీసుకుంటున్న వీడియోలు ఆమ్‌ఆద్మీ పార్టీని ఇరకాటంలో పెట్టాయి. తాజాగా జైలు అధికారులతో ఆయన కాలక్షేపానికి సంబంధించిన వీడియో కూడా లీక్ అయింది. దీంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ మరింత ఇబ్బందుల్లో పడింది.

satyendar-jain-another-video-viral-with-jail-superintendent
జైలు అధికారులతో టైమ్​పాస్ చేస్తున్న సత్యేందర్ జైన్

తన సెల్‌లో జైలు సూపరింటెండెంట్‌తో సత్యేంద్ర జైన్‌ మాట్లాడుతున్నట్లు ఉన్న ఒక వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోను కొందరు భాజపా నేతలు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ఇప్పటికే సత్యేంద్ర జైన్‌కు జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించినందుకు తిహాడ్‌ కారాగారం కాంప్లెక్స్‌లోని జైలు నంబర్‌-7 సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు.

జైలు సూపరిండెంట్ రాకతో బయటికి వెళ్తున్న జైలు అధికారులు

మనీలాండరింగ్‌ కేసులో మే 31వ తేదీ నుంచి సత్యేంద్ర జైన్‌ తిహాడ్‌ జైలులో ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జైలులో సత్యేంద్ర జైన్‌ రాజభోగాలు అనుభవిస్తున్నారని, ఓ రేపిస్టుతో ఆయన మసాజ్‌ చేయించుకున్నారని ఇప్పటికే భాజపా నేతలు ఆమ్‌ఆద్మీ పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం బయటకు వచ్చాయి. ఓ వీడియోలో జైన్.. మసాజ్ చేయించుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. జైలులో బయట నుంచి తెప్పించుకున్న ఆహారం తింటున్న మరో వీడియో సైతం బయటకు వచ్చింది.

Last Updated : Nov 26, 2022, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.