తమిళనాడులో రోజువారి కరోనా కేసుల్లో తగ్గుదల నమోదైంది. ఒక్కరోజే 16,813 కేసులు బయటపడ్డాయి. మరో 358 మంది కొవిడ్ బలయ్యారు. తాజాగా 32,049మంది కోలుకున్నారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షలకు దిగువకు చేరింది.
కేరళలో రోజువారి కొవిడ్ కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 14,424 మందికి వైరస్ సోకినట్లు తేలగా.. మరో 194 మంది కొవిడ్ బలయ్యారు.
మళ్లీ పెరిగిన కేసులు
మహారాష్ట్రలో రోజువారి కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా 12,207 మందికి కొవిడ్ సోకింది. మరో 393 మంది మరణించారు.
కర్ణాటకలోనూ కరోనా కేసులు కాస్త పెరిగినట్లు తెలుస్తోంది. ఒక్కరోజే 11,042 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కొవిడ్ ధాటికి మరో 194 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
- పంజాబ్‌లో కొత్తగా 1,333 మంది వైరస్ బారిన పడగా.. మరో 71 మంది చనిపోయారు.
- జమ్ముకశ్మీర్‌లో మరో 1,117 కేసులు వెలుగు చూశాయి. మరో 25 మంది కరోనాకు బలయ్యారు.
- మధ్యప్రదేశ్‌లో తాజాగా 420 మంది వైరస్ సోకగా.. మరో 34 మంది చనిపోయారు.
- దేశ రాజధాని దిల్లీలో మరో 305 మందికి పాజిటివ్‌గా తేలగా.. మరో 44 మంది మృతి చెందారు.
- రాజస్థాన్‌లో తాజాగా 538 కేసులు బయటపడ్డాయి. మరో 23 మంది మరణించారు.