ETV Bharat / bharat

రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. సర్పంచ్ దారుణ హత్య - ముష్కరులు కశ్మీర్ దాడి

Sarpanch killed in terrorists attack: జమ్ము కశ్మీర్​లో ఓ సర్పంచ్​ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాడి చేసింది తామేనని లష్కరే అనుబంధ ముఠాలు ప్రకటించుకున్నాయి.

terrorists attack on sarpanch
terrorists attack on sarpanch
author img

By

Published : Mar 9, 2022, 7:47 PM IST

Sarpanch killed in terrorists attack: జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ శివారులో ఓ సర్పంచ్​ను కాల్చి చంపేశారు. నిషేధిత లష్కరే తొయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ముష్కరులు ఈ ఘటనకు బాధ్యత ప్రకటించుకున్నారు.

మరణించిన సర్పంచ్​ను సమీర్ భట్​గా గుర్తించారు. భట్​కు పోలీసులు ముందు నుంచీ భద్రత కల్పిస్తున్నారు. శ్రీనగర్​లోని ఓ హోటల్​లో బస చేస్తున్న ఆయన.. బుధవారం ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్లారు. ఇదే సమయంలో ఉగ్రవాదులు నగర శివారులోని ఖాన్మోహ్ ప్రాంతంలో దాడి చేశారు.

గాయపడ్డ సర్పంచ్​ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించిన తర్వాత.. నిందితుల కోసం గాలింపు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు సాగిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: రోడ్డు పక్కన పేలిన బాంబు.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.